ప్రజాసంక్షేమమే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

ప్రజాసంక్షేమమే ధ్యేయం

Apr 17 2026 10:32 AM | Updated on Apr 17 2026 10:32 AM

● అదనపు కలెక్టర్‌ నగేశ్‌

● అదనపు కలెక్టర్‌ నగేశ్‌

చందుర్తి(వేములవాడ): ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల సభలు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ నగేశ్‌ పేర్కొన్నారు. చందుర్తిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా గురువారం నిర్వహించిన మండల సభకు అదనపు కలెక్టర్‌ నగేశ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగేశ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, అర్హులకు చేరువ చేయడమే ఈ సభల ముఖ్య ఉద్దేశ్యమన్నారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం అందజేస్తున్న ప్యూరిఫయర్‌ వాటర్‌ ఫిల్టర్స్‌ను పంపిణీ చేశారు. మండల ప్రత్యేకాధికారి, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్‌రెడ్డి, ఎంపీడీవో రాధ, తహసీల్దార్‌ భూపతి, ఎంపీవో ప్రదీప్‌, వ్యవసాయాధికారి దుర్గారాజు, స్థానిక సర్పంచ్‌ పులి సత్తయ్య, మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement