సిరిసిల్ల అర్బన్: వాహనదారులు సీటుబెల్ట్ ధరించాలని జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ కోరారు. ‘అరైవ్–అలైవ్’లో భాగంగా కలెక్టరేట్ చౌరస్తాలో సీటుబెల్ట్ వినియోగంపై గురువారం అవగాహన కల్పించారు. డ్రైవర్‌తోపాటు వాహనంలో ప్రయాణిస్తున్న వారు కూడా తప్పనిసరిగా సీటుబెల్టు ధరించాలని సూచించారు. సీఐ శ్రీనివాస్, మోటారు వాహనాల తనిఖీ అధికారి పృథ్వీరాజ్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.
ముస్తాబాద్(సిరిసిల్ల): మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక ప్రత్యేక సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. ప్రభుత్వ పథకాల్లో ప్రజల భాగస్వామ్యం పెంపు, పథకాలపై చర్చ సాగుతుండగా ముస్తాబాద్ సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాల్‌రెడ్డి మాట్లాడుతుండగా అప్పుడే సభలోకి వచ్చిన సర్పంచ్ వెంకట్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై బాల్‌రెడ్డి పథకాలను ప్రజలకు వివరిస్తున్నానని కూర్చోవాలని స్పష్టం చేశారు. అనంతరం జరిగిన సమీక్షలో వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కొందరు ఎన్నికల్లో లక్షలు ఖర్చు చేసిన గెలవలేదని, ఏమి ఖర్చు చేయని తనను గెలిపించి ఇక్కడ కూర్చోబెట్టారన్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వేదిక వద్దకు చేరుకొని సముదాయించారు. వాదోపవాదాల మధ్య సమావేశాన్ని ముగిస్తున్నట్లు ప్రత్యేక అధికారి ప్రకటించారు.
సర్పంచుల హక్కులు కాలరాయొద్దు
ప్రజల చేత ఎన్నికైన సర్పంచుల హక్కులను కాలరాయొద్దని తెర్లుమద్ది సర్పంచ్ బైతి దుర్గవ్వ కోరారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశాన్ని బహిష్కరించారు. దుర్గవ్వ మాట్లాడుతూ ఇంది రమ్మ కమిటీల పేరుతో సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
వేములవాడ: జిల్లాలో యువతను ప్రోత్సహించడానికి బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎల్లప్పుడూ ముందుంటారని బీఆర్‌ఎస్ ని యోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారా వు అన్నారు. మున్సిపల్ పరిధి కేసీఆర్ కప్ టోర్నీ ఫైనల్లో వేములవాడ కమాండర్స్ విజేతగా, వేములవాడ రాయల్స్ జట్టు రన్నరప్‌గా నిలిచాయి. విజేతకు రూ.50వేల నగదు, రన్నరప్ జట్టుకు రూ.20వేలు నగదు అందజేశారు. బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా టోర్నీ నిర్వహిస్తున్నట్లు లక్ష్మీనరసింహారావు తెలిపారు.
వేములవాడ: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) మున్సిపల్ ఆఫీస్‌లో ఈనెల 18న మైనారిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తుర్కాష్‌పల్లి లబ్ధిదారుల ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ సంపత్‌కుమార్ గురువారం ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారంతోపాటు సంబంధిత ఽసర్టిఫికెట్లతో సమయానికి చేరుకువాలని సూచించారు.
సిరిసిల్ల అర్బన్: తెలంగాణ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని టీజీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ కోరారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం భోజన విరామ సమయంలో ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. సంఘం నాయకులు మాట్లాడుతూ శుక్రవారం జిల్లాలోని తహసీల్దార్, ఆర్డీవో ఆఫీస్‌ల వద్ద నిరసన తెలిపి వినతిపత్రాల అందజేయాలని కోరారు. దినేశ్‌ప్రసాద్, జీపీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లారం అర్జున్, రమేశ్, శ్రీనివాస్, వేణు, రాజు, సాయి తేజ, లావణ్య, అంజలి, భరత్ పాల్గొన్నారు.


