సిరిసిల్లటౌన్: ప్రభుత్వం కరుణించి సొంతింటి కల సాకారం చేస్తే.. అధికారుల పట్టింపు లేక నీటి కోసం తండ్లాడుతున్నారు. సిరిసిల్ల శివారులోని పెద్దూరు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కాలనీలో 400 కుటుంబాలు నివసిస్తున్నాయి. మొదటి నుంచి ఇక్కడ తాగునీటికి ఇబ్బందులే ఉన్నాయి. అధికారులు మాత్రం వీరి నీటి కష్టాలను పట్టించుకో వ డం లేదు. మిషన్ భగీరథ సరఫరాలో తరచూ అంతరాయం కలగడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. కాలనీల్లో పై పోర్షన్లలో ఉండే వారు బిందెలతో రెండేసి ఫ్లోర్లు ఎక్కుకుంటూ అరిగోస పడుతున్నారు.


