వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

Apr 17 2026 10:32 AM | Updated on Apr 17 2026 10:32 AM

● జిల్లా వైద్యాధికారి రజిత

● జిల్లా వైద్యాధికారి రజిత

సిరిసిల్ల: ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి ఎస్‌.రజిత కోరారు. కలెక్టరేట్‌లోని వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో గురువారం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో సమీక్షించారు. రజిత మాట్లాడుతూ రాబోయే రోజులలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని ఉదయం 10 గంటల్లోపు, సాయంత్రం 4 గంటల తర్వాతే పనులు చేసుకోవాలని సూచించారు. వడదెబ్బ తగలకుండా అధికంగా ద్రవ పదార్థాలు సేవించాలన్నారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. సాధారణ ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగేలా ప్రోత్సహించాలన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు టీకాలు సకాలంలో వేయించాలన్నారు. సమావేశంలో ఉపవైద్యాధికారి నాగేంద్రబాబు, ప్రోగ్రాం ఆఫీసర్లు సంపత్‌కుమార్‌, డాక్టర్‌ రామకృష్ణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement