● బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటీవ్ మెంబర్ కీర్తిరెడ్డి
సిరిసిల్లటౌన్: మహిళాభ్యుదయమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటీవ్ మెంబర్ కీర్తిరెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్లలో గురువారం పార్టీ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నారీ శక్తివందన్ నిర్వహించారు. అంబేడ్కర్ చౌరస్తా నుంచి గాంఽధీచౌక్ మీదుగా బతుకమ్మఘాట్ వరకు చేపట్టిన పాదయాత్రలో వందలాది మహిళలు పాల్గొన్నారు. మహిళా సాధికారతకు ప్రధాన మంత్రి నరేంద్రమోడి బంగారు బాటలు వేస్తున్నారన్నారు. నలభై ఏళ్లుగా పెండింగ్‌లో ఉంటున్న మహిళా బిల్లును మోదీ ఆధ్వర్యంలో పార్లమెంటు ఆమోదం లభిస్తుందన్నారు. దేశం వెనుకబాటుకు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలను ప్రధాని నరేంద్రమోదీ సరిదిద్దుతున్నారన్నారు. డాక్టర్ దీపా వికాస్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.


