● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: ప్రభుత్వ పథకాలకు నిబంధనలకు అనుగుణంగా అర్హులను ఎంపిక చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా ఎస్సీ కులాల సహకార సంఘం(ఎస్సీ కార్పొరేషన్) యాక్షన్‌ప్లాన్‌పై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారులు, మండల స్థాయిలో లక్ష్యాల కేటాయింపులను నిర్ణీత సమయంలో చేయాలని సూచించారు. ఎస్సీ కార్పొరేషన్ కింద వ్యవసాయ రంగం(సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్), పశుపోషణ రంగం( రెండు మిల్క్ యానిమల్స్), రవాణా ఈవీ త్రీ వీలర్స్(గూడ్స్), ఈవీ త్రీ వీలర్స్(ప్యాసింజర్స్), ఈవీ టూ వీలర్స్ పరికరాలు సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. నిబంధనల మేరకు అర్హులను ఎంపిక చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, పరిశ్రమలశాఖ జీఎం హనుమంతు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్‌రెడ్డి, జిల్లా రవాణా అధికారి వి.లక్ష్మణ్‌కుమార్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎన్.మల్లికార్జునరావు పాల్గొన్నారు.


