కెనాల్‌పై చెట్ల నరికివేతపై విచారణ | - | Sakshi
Sakshi News home page

కెనాల్‌పై చెట్ల నరికివేతపై విచారణ

Apr 16 2026 9:54 AM | Updated on Apr 16 2026 9:54 AM

ముస్తాబాద్‌(సిరిసిల్ల): మానేరు ప్రాజెక్టు కెనాల్‌పై చెట్ల నరికివేత ఫారెస్టు, నీటిపారుదలశాఖ అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. మండలంలోని తెర్లుమద్దిలో ఎగువమానేరు ప్రాజెక్టు కెనాల్‌పై చెట్లు నరికివేశారనే ఫిర్యాదుతో బుధవారం విచారణ చేపట్టినట్లు డిప్యూటీ ఫారెస్టు రేంజర్‌ అంజలి తెలిపారు. మానేరు కెనాల్‌ వెంట చెట్లను నరికివేయడం నేరమన్నారు. రైతులు సైతం కెనాల్‌ను ధ్వంసం చేయడంతోపాటు చెట్లను నరికివేసినట్లు గుర్తించామన్నారు. చెట్లు నరికిన వారికి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఒక చెట్టు నరికితే రూ.500 జరిమానాతోపాటు మరో రెండు చెట్లు నాటాలని సూచించారు. నీటిపారుదలశాఖ డీఈఈ రవికుమార్‌తో కలిసి పరిశీలించారు. సర్పంచ్‌ బైతి దుర్గవ్వ, డీఈ రవికుమార్‌, ఏఈ నవీన్‌, బీట్‌ ఆఫీసర్‌ రమేశ్‌, కార్యదర్శి సౌజన్య, మాజీ సర్పంచ్‌ మల్లేశ్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement