14 నుంచి అగ్నిమాపక వారోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

14 నుంచి అగ్నిమాపక వారోత్సవాలు

Apr 16 2026 9:54 AM | Updated on Apr 16 2026 9:54 AM

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే

సిరిసిల్ల క్రైం: అగ్ని ప్రమాదాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈనెల 14 నుంచి అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ మహేశ్‌ బీ గీతే తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. అగ్నిమాపక సిబ్బంది స్మారకార్థం ఏటా ఈనెల 14 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా అగ్నిమాపక దళ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వారం రోజులపాటు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు, అపార్ట్‌మెంట్స్‌, పెట్రోల్‌బంకుల్లో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్‌ఐలు యాదగిరి, రమేశ్‌, సురేష్‌, స్టేషన్‌ ఫైరాఫీసర్‌ నరేందర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement