రోడ్డు భద్రత సామాజిక బాధ్యత | - | Sakshi
Sakshi News home page

రోడ్డు భద్రత సామాజిక బాధ్యత

Apr 16 2026 9:54 AM | Updated on Apr 16 2026 9:54 AM

● డీఎస్పీ నాగేంద్రచారి

● డీఎస్పీ నాగేంద్రచారి

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రోడ్డు భద్రతను సామాజిక బాధ్యతగా గుర్తించాలని డీఎస్పీ నాగేంద్రచారి కోరారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాగట్లపల్లి శివారులో సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ సూచికబోర్డులను బుధవారం పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రమాద సూచికల ఏర్పాటును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డీఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ పోలీసులు ఏర్పాటు చేసిన సూచికలు డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడపడానికి సహాయపడతాయన్నారు. వాహనదారులు హెల్మెట్‌, సీటుబెల్టు ధరించాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకెళ్లడం ఖాయమని హెచ్చరించారు. సీఐ వెంకటేశ్‌, ఎస్సై రాహుల్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement