సిరిసిల్ల: జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్‌గా టి.వేణుమాధవ్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఎస్‌ఈగా, ‘సెస్’ ఎండీగా పనిచేసిన బి.భిక్షపతిని ములుగు జిల్లా ఎస్‌ఈగా బదిలీ అయ్యారు. వేణుమాధవ్ కార్పొరేట్ ఆఫీసులో జనరల్ మేనేజర్ పని చేశారు. గతంలో కరీంనగర్ డీఈఈగా, జగిత్యాల, జనగామ జిల్లాలో ఎస్‌ఈగా పని చేశారు. విధుల్లో చేరిన ఎస్‌ఈకి ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ బి.భిక్షపతి, డీఈఈలు అంజయ్య, వెంకటరమణ, ఏడీఈలు శ్రీనివాస్, రఘునాథ్, గోపి, అనిల్‌కుమార్, గంగాధర్, రాజు, రఘు, ప్రదీప్, రాజలింగం, ఏవోలు అరవింద్, రవి, ఏఈఈలు, సిబ్బంది శుభాకాంక్షలు తెలుపు తూ సన్మానించారు. జిల్లాలో నాణ్యమైన విద్యుత్ సరఫరా, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని వేణుమాధవ్ తెలిపారు.
సమ్మెకు ఆర్టీసీ కార్మికులు సిద్ధం
సిరిసిల్లటౌన్: ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నిరవధిక సమ్మెకు సిద్ధమైనట్లు సిరిసిల్ల డిపోలోని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. ఈమేరకు మంగళవారం డిపో ఎదుట నిరసన తెలుపగా వక్తలు మాట్లాడారు. గత ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానం ప్రకారం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 2021, 2025 వేతన సవరణలను తక్షణమే అమలు చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలబెట్టాలని, లేకుంటే రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సమ్మెకు సిద్ధమైనట్లు హెచ్చరించారు. అనంతరం నూతన జేఏసీ కమిటీ చైర్మన్‌గా బాణయ్య(కండక్టర్), వైస్ చైర్మన్‌గా జీఎన్ రావు (డ్రైవర్), వైస్ చైర్మన్‌గా బి. శ్రీనివాస్(డ్రైవర్), కన్వీనర్‌గా వి.రాజేందర్, ఎం.ముత్యం, ఆర్.రాంచంద్రం, తిరుపతి, మహిళా కన్వీనర్లుగా కవిత, సునీత, సుమలతను ఎన్నుకున్నారు.
‘చిటికెన’కు అంబేడ్కర్ సేవా స్ఫూర్తి అవార్డు
సిరిసిల్ల: సిరిసిల్లకు చెందిన సాహిత్యకారుడు చిటికెన కిరణ్‌కుమార్‌కు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సేవా స్ఫూర్తి అవార్డు– 2026 లభించింది. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన ‘మనం’ ఫౌండేషన్ కిరణ్‌కుమార్ సాహిత్య సేవలను గుర్తిస్తూ అవార్డు అందించింది. కిరణ్‌కుమార్ కవిత్వం, కథలు, వ్యాసాలు, సమీక్షలు చేస్తూ ప్రశంసలు అందుకున్నారు. ఆయన రాసిన ‘ఓ తండ్రి తీర్పు’ వంటి రచనల ద్వారా సమాజానికి స్ఫూ ర్తినిచ్చే సందేశాలను అందించారు. ఆయ న సాహిత్య సృజనకు గుర్తింపునిస్తూ అంబేడ్కర్ జయంతి సందర్భంగా అవార్డును అందుకున్నారు. సిరిసిల్లలోని సాహిత్య మిత్రులు మంగళవారం కిరణ్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు.
క్రీడలతో స్నేహభావం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే క్రీడలతో క్రీడాకారుల మధ్య స్నేహభావం పెంపొందుతుందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. మండలకేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ కప్ ఫైనల్‌లో మ్యాచ్‌లో ధూమాల, రాచర్ల తిమ్మాపూర్ జట్లు తలపడగా దుమాల జట్టు విజేతగా నిలిచింది. విజేత జట్టుకు రూ.50వేల నగదు, షీల్డ్, రెండోస్థానంలో నిలిచిన రాచర్లతిమ్మాపూర్ జట్టుకు రూ.20వేల నగదు, షీల్డ్ అందజేశారు. రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వరస కృష్ణహరి, మాజీ జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, మాజీ ఎంపీపీ పిల్లి రేణుక, సెస్ మాజీ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


