హిందువుల సంఘటితమే దేశ అభ్యున్నతికి మార్గం | - | Sakshi
Sakshi News home page

హిందువుల సంఘటితమే దేశ అభ్యున్నతికి మార్గం

Apr 15 2026 8:56 AM | Updated on Apr 15 2026 8:56 AM

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): హిందూ సమాజాన్ని సంఘటితంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందని కామారెడ్డి విరాట్‌ హిందూ పరివార్‌ అధ్యక్షుడు డాక్టర్‌ యజ్ఞం పవన్‌కుమార్‌ శర్మ, జాతీయ సాహిత్య పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు గాజుల రవీందర్‌ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని రాచర్ల బొప్పాపూర్‌లో విరాట్‌ హిందూ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. స్వార్థాన్ని వదిలి ధర్మం కోసం పనిచేయడం ప్రతీ హిందువు ధర్మమని చెప్పారు. దేశంలో కొన్ని ప్రాంతాల్లో హిందువులపై హింసాత్మక చర్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హిందువుల జనాభా తగ్గుతున్న నేపథ్యంలో సమాజ రక్షణ కోసం భవిష్యత్‌ తరాలను బలపరిచే దిశగా ప్రతీ కుటుంబం బాధ్యత వహించాలని సూచించారు. వచ్చే 25 ఏళ్లలో భారత్‌ను విశ్వగురు స్థానంలో నిలపడం లక్ష్యంగా సంఘం పని చేస్తోందని, ప్రతి గ్రామంలో ఒక గంట శాఖ కార్యకలాపాలకు సమాయాన్ని కేటాయించాలని పేర్కొన్నారు. మహిళా వాక్త కొండ వాణి– నర్సయ్య, సర్పంచ్‌లు ఇల్లందుల గీతాంజలి, కొండ రమేశ్‌గౌడ్‌, నాగెల్లి వెంకటరెడ్డి, అందె సుభాష్‌, కల్లూరి బాపురెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement