జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఈదురు గాలులతో కూడిన వర్షం అన్నదాతకు అపార నష్టం కలిగించింది. బోయినపల్లి, ఇల్లంతకుంట, చందుర్తి, వీర్నపల్లి మండలాల్లో 3,580 ఎకరాల్లో మొక్కజొన్న పంట వేయగా 270 ఎకరాల్లో పంట దెబ్బతింది. కోతకొచ్చిన వరి నేలవాలింది. మామిడి తోటల్లో కాయలు నేల రాలాయి. మొక్కజొన్న, వరి, మామిడి రైతులకు కొంత మేరకు నష్టం జరిగింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే నీటిపాలవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
– బోయినపల్లి/ఇల్లంతకుంట/చందుర్తి/వీర్నపల్లి


