రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాలల పోటీలకు 20 మంది ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాలల పోటీలకు 20 మంది ఎంపిక

Apr 1 2026 8:18 AM | Updated on Apr 1 2026 8:18 AM

సిరిసిల్లఅర్బన్‌ : జిల్లా స్థాయి క్రీడా పాఠశాలల పోటీల్లో 20 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పాఠశాలలకు ఎంపికయ్యారని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రాందాస్‌ తెలిపారు. మంగళవారం సిరిసిల్ల మున్సిపల్‌ పరిదిలోని మినీ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పాఠశాలల పోటీల్లో సుమారు 50 మంది పాల్గొనగా 10 మంది బాలురు, 10 మంది బాలికలు ఎంపికయ్యారని అన్నారు. రాష్ట్ర స్థాయి క్రీడా పాఠశాలలకు ఎంపికై న విద్యార్థులు 27 ఏప్రిల్‌ 2026 నుంచి 1 మే 2026 వరకు జరిగే రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాలల పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మినీ స్టేడియం వాలీబాల్‌ అకాడమీ కోచ్‌లు, వివిధ మండలాల వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement