సిరిసిల్లఅర్బన్: విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయుల పెన్షన్ బకాయిలను వెంటనే చెల్లించాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మల్లారపు పురుషోత్తం అన్నారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద రిటైర్డ్ ఉద్యోగులతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు. 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయుల పెన్షన్‌ను ప్రభుత్వం చెల్లించలేదన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా నాయకులు ద్యావనపెల్లి పరమేశ్, జనపాల వెంకటయ్య, ముత్యాల ప్రభాకర్, గోవిందరావు, జీవన్‌రెడ్డి, ప్రకాశ్‌రావు, రాజు, రెహమాన్, తదితరులు పాల్గొన్నారు.


