‘మహాలక్ష్మి’తో ఆర్థిక స్వావలంబన | - | Sakshi
Sakshi News home page

‘మహాలక్ష్మి’తో ఆర్థిక స్వావలంబన

Apr 1 2026 8:18 AM | Updated on Apr 1 2026 8:18 AM

● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని, ఆర్థిక స్వావలంబనకు ఉపయోగ పడుతుందని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ అన్నారు. సిరిసిల్ల కొత్త బస్టాండులో మంగళవారం ఉచిత ప్రయాణాలు చేస్తూ ఆర్థికంగా స్థిరపడుతున్న మహిళలకు బహుమతులు అందిస్తూ.. ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి రెండేళ్లకు పైగా పూర్తి అయి రూ.290 కోట్ల ప్రయాణాలు, రూ.10 వేల కోట్లు ఆదా చేసిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. ఉచిత బస్సు ప్రయాణంతో ప్రైవేట్‌ ఉ ద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు డబ్బులు ఆదా చేసుకొని, వాటిని పిల్లల చదువు, స్వయం ఉపాధి, పొదుపు వైపు మళ్లిస్తున్నారని తెలి పారు. కార్యక్రమంలో డీఆర్డీవో మచ్చ గీత, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సిరిసిల్ల, వేములవాడ ఆర్టీసీ డీఎంలు ప్రకాశరావు, శ్రీనివాస్‌, మెప్మా ఏవో మీర్జా ఫసహత్‌ అలీ బేగ్‌, తహసీల్దార్‌ మహేశ్‌ కుమార్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జనగణనలో మాస్టర్‌ ట్రైనర్లు కీలకం

జనగణన 2027లో మాస్టర్‌ ట్రైనర్లు కీలకమని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం సెన్సస్‌ మానిటరింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌, (సీఎంఎంఎస్‌), డిజిటల్‌ విధానం, హౌస్‌ లిస్టింగ్‌ ఆపరేషన్స్‌పై మాస్టర్‌ ట్రైనర్లకు ఇచ్చిన శిక్షణలో మాట్లాడారు. రాష్ట్రంలో డిజిటల్‌ విధానంలో జరిగే మొదటి జనగణనని, మే 11నుంచి జూన్‌ 9వరకు ఇళ్ల గణన నిర్వహిస్తారని, రెండో దశ ఫిబ్రవరి 2027లో వ్యక్తుల వారీగా సమాచారం సేకరిస్తారని తెలిపారు. జనగణన సేకరించే వివరాలు కీలకమని అన్నారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా డైరెక్టర్‌ ఆఫ్‌ సెన్సెస్‌ ఆపరేషన్‌ మాస్టర్‌ ట్రైనర్‌ శివ రామకృష్ణ వివరించారు. శిక్షణలో జిల్లా ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, గణాంక అధికారి సంపత్‌ కుమార్‌, మాస్టర్‌ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement