అక్రమ పట్టా రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

అక్రమ పట్టా రద్దు చేయాలి

Apr 1 2026 8:18 AM | Updated on Apr 1 2026 8:18 AM

సిరిసిల్ల: మా పూర్వీకుల భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్న వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సిరిసిల్ల పట్టణ శివారులోని పెద్దూరుకు చెందిన పలువురు మంగళవారం సిరిసిల్ల తహసీల్దార్‌ ఆఫీస్‌ ఎదుట ఆందోళన చేశారు. పెద్దూరు శివారులోని సర్వేనం.402లో ఖాతా నం.501, 344, 100064లో 9.20 ఎకరాల భూమి శ్రీరామల నారాయణ, చీకోటి సత్యనారాయణ, జిన్న పోషవ్వ, ఎల్లవేణి అనసూర్య, చీకోటి లచ్చవ్వ, చీకోటి రాజు, దాసరి దేవయ్య, జిన్న దేవయ్యలకు సంబంధించిన పూర్వీకులదన్నారు. పెద్దూరుకు చెందిన గండ్ర జయసింహారావు అక్రమంగా పట్టా చేయించుకుని ధరణి, భూభారతిలో పేరు మార్పిడి చేయించుకున్నారని బాధితులు ఆరోపించారు. ఈ మేరకు ప్రజావాణిలో సోమవారం ఫిర్యాదు చేశామని వివరించారు. తహసీల్దార్‌ను కలవాలని కలెక్టర్‌ సూచించగా తహసీల్దార్‌ ఆఫీస్‌కు తరలివచ్చినట్లు తెలిపారు. రెవెన్యూ అధి కారులు క్షేత్రస్థాయిలో విచారణ న్యాయం చేయాలని, అక్రమ పట్టాను రద్దు చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement