సిరిసిల్లటౌన్: సర్కారు వైఫల్యంతోనే గురుకుల విద్యార్థి మృతిచెందిందని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలల్లో సమస్యలు పెరిగాయన్నారు. విద్యార్థుల భద్రత, సంక్షేమంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు ఆరెల్లి వినయ్ కుమార్, ఎండీ అజ్జు, లింగంపల్లి రామ్‌చరణ్, పవన్, జశ్విత్, ఈశ్వర్, కలీం తదితరులు పాల్గొన్నారు.


