ఆపద సమయాల్లో ముందుండి సేవలందించాలి | - | Sakshi
Sakshi News home page

ఆపద సమయాల్లో ముందుండి సేవలందించాలి

Apr 1 2026 8:18 AM | Updated on Apr 1 2026 8:18 AM

సిరిసిల్ల అర్బన్‌: సమాజానికి ఆపద కలిగినప్పుడు కెడెట్లు ముందుండి సేవలందించాలని 17వ బెటాలియన్‌ కమాండెంట్‌ ఎంఐ సురేశ్‌ అన్నారు. మంగళవారం సర్దాపూర్‌ 17వ బెటాలియన్‌లో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) బృందం, యువ ఆపద మిత్ర స్కీం కింద ఎన్‌సీసీ కెడెట్లకు విపత్తు నివారణ, సహాయక చర్యలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆర్‌ఎస్సై కె.నరేశ్‌ నేతృత్వంలో మెడికల్‌ ఫస్ట్‌ రెస్పాండర్‌, సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ, రోప్‌ నాట్స్‌, హిచేన్‌ రెస్క్యూ ఆపరేషన్లు, వాటర్‌ రెస్క్యూ, స్విమ్మింగ్‌, విపత్తుల అవగాహన తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం కెడెట్లకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వెంకటేశ్‌, ప్రశాంత్‌, లక్ష్మణ్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement