నియమించారు! | - | Sakshi
Sakshi News home page

నియమించారు!

Mar 26 2026 7:21 AM | Updated on Mar 26 2026 7:21 AM

గురువారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2026 ● ‘అర్బన్‌ బ్యాంకు’లో వసూళ్లపర్వం ● ఒక్కో పోస్టుకు రూ.3లక్షల నుంచి రూ.5లక్షలు వసూలు ● చక్రం తిప్పిన అర్బన్‌బ్యాంకు కీలక నేత ● 8 పోస్టులకు 67 మంది దరఖాస్తు

న్యూస్‌రీల్‌

బయటకొస్తే మీకే నష్టమంటూ..

గురువారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2026
లక్షణంగా
● ‘అర్బన్‌ బ్యాంకు’లో వసూళ్లపర్వం ● ఒక్కో పోస్టుకు రూ.3లక్షల నుంచి రూ.5లక్షలు వసూలు ● చక్రం తిప్పిన అర్బన్‌బ్యాంకు కీలక నేత ● 8 పోస్టులకు 67 మంది దరఖాస్తు

సిరిసిల్ల: సిరిసిల్ల సహకార అర్బన్‌ బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగులను ‘లక్ష’ణంగా నియమించారు. ప్రతిభ ఉన్న అభ్యర్థులను, బ్యాంకు అభివృద్ధికి పనిచేసే వారిని నియమించాల్సి ఉండగా.. పైరవీలకు పెద్దపీట వేశారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. గత శుక్రవారం ఆరు కాంట్రాక్టు పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించగా 46 మంది హాజరయ్యారు. ఎంపికై న అభ్యర్థులు ఆరుగురు సోమవారం విధుల్లో చేరారు. ఒక్కో కాంట్రాక్టు పోస్టుకు రూ.3లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం.

అక్టోబరులో నోటిఫికేషన్‌

సిరిసిల్ల సహకార అర్బన్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌లు ఉన్న సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేటల్లో ఏటా రూ.వందల కోట్ల వ్యాపారం జరుగుతుంది. రెండు బ్రాంచ్‌లలో కలిపి 10 వేల మంది సభ్యులతో ఏటా సుమారు రూ.750 కోట్ల లావాదేవీలతో రూ.125కోట్ల డిపాజిట్లతో రూ.90 కోట్ల రుణాలు అందించింది. వేములవాడ, కరీంనగర్‌లోనూ కొత్తగా బ్రాంచ్‌ల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే సరిపోయేంత సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈక్రమంలోనే రెండు మేనేజర్‌ పోస్టులు, ఆరు క్లర్క్‌ పోస్టుల భర్తీకి 2025, అక్టోబరులో నోటిఫికేషన్‌ జారీ చేశారు. మేనేజర్‌ పోస్టులకు నలుగురు, క్లర్క్‌ పోస్టులకు 63 మంది దరఖాస్తు చేశారు. ప్రతిభ ఆధారంగా కాకుండా పైరవీలు, పైసలతో నియామకాలు జరిగినట్లు చర్చ సాగుతోంది. రెండు మేనేజర్‌ పోస్టులకు అనర్హులు దరఖాస్తు చేయడంతో ఆ పోస్టుల భర్తీని నిలిపివేశారు.

సీఈవో పోస్టుకు రెండు సార్లు నోటిఫికేషన్‌

అర్బన్‌బ్యాంకులో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈవో) నియామకానికి గతంలో రెండుసార్లు నో టిఫికేషన్‌ ఇచ్చారు. సిరిసిల్ల సహకార అర్బన్‌ బ్యాంకు సీఈవో పత్తిపాక శ్రీనివాస్‌ 2020లో రిటైర్డు అయ్యారు. ఆయన స్థానంలో సీనియర్‌ అధికారి శేరి శ్రీనివాస్‌ను ఇన్‌చార్జి సీఈవోగా నియమించారు. పనులు, పాలకవర్గం ఒత్తిళ్లతో శ్రీనివాస్‌ దీర్ఘకాలిక సెలవు పెట్టారు. ఆయన స్థానంలో కరీంనగర్‌కు చెందిన చీటి ప్రకాశ్‌రావును సీఈవోగా తీసుకునేందుకు ప్రతిపాదించారు. వాస్తవానికి చీటి ప్రకాశ్‌రావు మహారాష్ట్రలో 2014 అక్టోబరులో రిటైర్డు అ య్యారు. ఆయన్ని అప్పట్లో రాజకీయ ఒత్తిళ్లతో బ్యాంకు సీఈవోగా నియమించారనే ఆరోపణలు న్నాయి. 2021లో ఒక్కసారి, 2022 జూలై 7న మరో సారి బ్యాంకు సీఈవో పోస్టు కోసం నోటిఫికేషన్‌ ఇచ్చారు. 27 మంది దరఖాస్తు చేశారు. కానీ అభ్యర్థులకు సమాచారం ఇవ్వకుండా.. ఇంటర్వ్యూలు నిర్వహించకుండానే నియామకాలను పక్కన పెట్టారు. మళ్లీ అక్టోబరులో కాంట్రాక్టు జూనియర్‌ అసిస్టెంట్‌(క్లర్క్‌) పోస్టులకు నోటిఫికేషన్‌ రావడంతో అనేక మంది నిరుద్యోగులు ఆశతో దరఖాస్తు చేశారు. ఆ పోస్టులు అమ్ముడుపోవడంతో ప్రతిభ గల నిరుద్యోగులను నిరాశకు గురిచేస్తుంది.

అర్బన్‌ బ్యాంకు పాలకవర్గంలోని ఓ కీలక నేత వసూళ్లపర్వాన్ని కొనసాగించినట్లు సమాచారం. ఒక్కో అభ్యర్థి వద్ద రూ.3.50లక్షలు తీసుకుంటూ.. పాలకవర్గంలోని వారికి రూ.3 లక్షలే ఇచ్చినట్లు చెప్పాలని, మిగతా రూ.50వేలు ఖర్చులు ఉన్నాయని సదరు కీలకనేత స్పష్టం చేసినట్లు తెలిసింది. మీ ఉద్యోగాలు కాంట్రాక్టు పద్ధతిలో నియామకమై.. పర్మినెంట్‌ అవుతాయని, డబ్బుల విషయం బయటకొస్తే మీకే నష్టమంటూ బెదిరింపులకు గురిచేసినట్లు సమాచారం. వసూళ్లపర్వంలోనూ తారతమ్యాలు పాలకవర్గంలో తీవ్ర చర్చకు తెరలేపాయి. ఈ వసూళ్లపర్వంపై సహకార శాఖ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement