ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసుకోవాలి
కలెక్టర్ గరీమా అగ్రవాల్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అందిస్తున్న రూ.5లక్షల ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. మండల కేంద్రంలోని మోడల్ హౌ స్‌ను బుధవారం ప్రారంభించారు. అనంతర గుండారంలో చెందిన సిద్ధాల అఖిల, కంకణాల శ్రీలత, ఇందిరాల మమత, లకావత్ సునీత ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ ప్రారంభించారు.
ఫిల్లర్ రూఫింగ్‌తో ఖర్చు ఆదా
హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన మోడల్ హౌస్‌లో ఉష్ణోగ్రత కొన్ని డిగ్రీలు తగ్గించేందుకు, స్లాబ్ నిర్మాణ ఖర్చు తగ్గించేందుకు ఫిల్లర్ రూఫింగ్ విధానంలో నిర్మించడంపై అధికారులను అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 777 ఇందిరమ్మ ఇండ్లు పూర్తయినట్లు తెలి పారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ సాబేరా బేగం, హౌసింగ్ పీడీ వెంకటమాధవరావు, డీఈ సాజిద్, ప్రత్యేకాధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో సత్తయ్య, ఎంపీవో రాజు పాల్గొన్నారు.
భవిత కేంద్రం సేవలు వినియోగించుకోవాలి
దివ్యాంగ విద్యార్థులు భవిత కేంద్రం సేవలు వినియోగించుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. మండలకేంద్రంలో భవిత కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రతీ బుధవారం, గురువారం ఐఈఆర్పీ, ఫిజియోథెరపిస్ట్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపా రు. అనంతరం మండల సమాఖ్య భవనాన్ని పరిశీ లించారు. జూనియర్ కళాశాల మైదానంలో పనులు పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ సాబేరా బేగం, జిల్లా విద్యాధికారి జగన్‌మోహన్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో సత్తయ్య, ఎంఈవో కృష్ణహరి పాల్గొన్నారు.
సేంద్రియ సాగు చేయండి
కోనరావుపేట(వేములవాడ): రైతులు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ధర్మారంలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. సేంద్రియ ఉత్పత్తుల తయారీ కేంద్రంలో కషాయాలు, సేంద్రియ ఎరువు తయారీ విధానం పశువుల పెంపకం ఇతర అంశాలను పరిశీలించారు. జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీవో నటరాజ్, సర్పంచ్ మిర్యాల్‌కార్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.


