వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలో మంగళవారం కురిసిన వడగండ్ల వానకు జరిగిన పంటనష్టాన్ని బుధవారం వ్యవసాయాధికారులు పరిశీలించారు. ఎర్రగడ్డతండా, రంగంపేట, బాబాయిచెరువుతండా, భూక్యాతండా, బావుసింగ్‌తండా, లాల్‌సింగ్‌తండాల్లోని పొలాను పరిశీలించారు. దాదాపు 185 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. పంట పరిశీలనలో వ్యవసాయాధికారి ఫజిలుద్దీన్, రైతులు పాల్గొన్నారు.
చందుర్తిలో 50 ఎకరాల్లో పంట నష్టం
చందుర్తి(వేములవాడ): మండలంలోని తిమ్మాపూర్, ఆశిరెడ్డిపల్లె, రామన్నపేట, చందుర్తి గ్రామాల్లో కురిసిన వడగండ్ల వానకు 50 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. ఆయా గ్రామాల్లో ఏఈవోలు బుధవారం పరిశీలించారు. తిమ్మాపూర్‌లో గడికొప్పుల రాజేశం(6 ఎకరాలు), అట్టపెల్లి సతీశ్(3 ఎకరాలు), పేరుక మల్లేశం(5 ఎకరాలు), బొడ్డు దేవయ్య(2 ఎకరాలు), చందుర్తిలో మెంగని హన్మండ్లు, కోన లక్ష్మణ్, కోన శ్రీనివాస్, మర్రి మల్లేశంతోపాటు పలువురికి చెందిన 34 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ఏఈవోలు యోగేశ్వర్, ప్రవీణ్ తెలిపారు.


