ఏడున్నరో..
ఫోన్‌లో మాట్లాడుతున్న ఈమె బడుగు లక్ష్మి. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన లక్ష్మి ఇద్దరు కొడుకులు బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లారు. పెద్ద కొడుకు ప్రేమ్‌జిత్ ఏడాదిన్నర కిందట దుబాయ్ వెళ్లగా.. చిన్నకొడుకు రంజిత్ ఏడు నెలల కిందట వెళ్లాడు. ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుందని, బాంబులు వేస్తున్నారని తెలియడంతో లక్ష్మి, ఆమె భర్త నర్సయ్య ఆందోళనకు గురవుతున్నారు. బతుకుదెరువు కోసం వెళ్లిన కొడుకులు ఇద్దరు ఎలా ఉన్నారోనని ఆందోళనతో ఫోన్‌లో మాట్లాడుతోంది. తాము బాగానే ఉన్నామని, భయపడొద్దని కొడుకులు ప్రేమ్‌జిత్, రంజిత్ చెబుతున్నా.. లక్ష్మి, నర్సయ్య గుండెల్లో గుబులు పోవడం లేదు.


