● ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ భిక్షపతి
సిరిసిల్లటౌన్: రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అవకాశం కల్పించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ యెలగందుల భి క్షపతి కోరారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు మూడు పార్లమెంటు సీట్లు ఉంటే ఒక్క సీటు కూడా మాదిగలకు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో 60 లక్షలకు పైగా మాదిగలు ఉంటే ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం లేకపోవడం అన్యాయమన్నారు. నాయకులు ఆవునూరి ప్రభాకర్, గుండా థామస్, నాయకులు గుండ్రెడ్డి రాజు, ఖానాపూర్ లక్ష్మణ్, కొమ్ము రాజశేఖర్, సామల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షకు 127 మంది గైర్హాజర్
సిరిసిల్ల ఎడ్యుకేషన్: ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నట్లు డీఐఈవో శరత్‌కుమార్ తెలిపారు. సోమవారం గణితం, పొలిటికల్ సైన్స్, బోటనీ పేపర్–1 నిర్వహించారు. 4,764 మందికి 4,637 మంది విద్యార్థులు హాజరయ్యారని, 127 మంది గైర్హాజరయ్యారని వివరించారు.


