సాక్షి బ్యూరో ఇన్‌చార్జికి ఉత్తమ జర్నలిస్టు అవార్డు | - | Sakshi
Sakshi News home page

సాక్షి బ్యూరో ఇన్‌చార్జికి ఉత్తమ జర్నలిస్టు అవార్డు

Feb 20 2026 6:27 AM | Updated on Feb 20 2026 6:27 AM

సాక్ష

సాక్షి బ్యూరో ఇన్‌చార్జికి ఉత్తమ జర్నలిస్టు అవార్డు

● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం ● ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

కరీంనగర్‌: కరీంనగర్‌ ‘సాక్షి’ బ్యూరో ఇన్‌చార్జి అనిల్‌కుమార్‌ ఉత్తమ జర్నలిస్టు పురస్కారం అందుకున్నారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో ఈ పురస్కారం అందించారు. జర్నలిజంలో మెరుగైన సేవలకు ఎంపిక చేశారు. అదే విధంగా కరీంనగర్‌కు చెందిన సీనియర్‌ జర్నలిస్టులు తాడూరి కరుణాకర్‌, ప్రమోద్‌కుమార్‌ పురస్కారాలు అందుకున్నారు. హర్యానా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఈ పురస్కారాలు అందజేశారు.

ఎరువుల కొరత లేదు

సిరిసిల్ల/తంగళ్లపల్లి(సిరిసిల్ల): రైతులు ఎరువుల కొనుగోలులో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫెర్టిలైజర్‌ యాప్‌’ సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ కోరారు. తంగళ్లల్లి మండలంలోని గ్రోమోర్‌ ఎరువుల దుకాణాన్ని గురువారం తనిఖీ చేశారు. యాప్‌ ద్వారా జరుగుతున్న బుకింగ్‌, నిల్వలు, పంపిణీ తీరును పరిశీలించారు. గోదాంలోని నిల్వలను సిబ్బందితో లెక్కింపజేసి సరిచూశారు. యాప్‌ వాడకంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఫెర్టిలైజర్‌ షాపులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏడీఏ ప్రదీప్‌, తహసీల్దార్‌ విజయ ప్రకాశ్‌రావు, ఏవో కె.సంజీవ్‌ పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి ఆర్థికసాయం

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో టౌన్‌ మిషన్‌ కో–ఆర్డినేటర్‌(టీఎంసీ)గా పనిచేసే చంటి రాజమణి ఇటీవల మరణించగా ఆమె కుటుంబ సభ్యులకు కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ రూ.1.50లక్షల చెక్కును అందించారు. మున్సిపాలిటీలో టీఎంసీగా పనిచేసే రాజమణి 2024 అక్టోబర్‌లో మరణించారు. స్రీనిధి క్రెడిట్‌ కో ఆపరేటీవ్‌ ఫెడరేషన్‌ నుంచి రూ.1.50 లక్షలు మంజూరు కాగా.. ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఏవోఓ మీర్జా ఫసహత్‌ అలీ బేగ్‌, స్రీ నిధి రీజినల్‌ మేనేజర్‌ భూ కై లాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇల్లంతకుంట(మానకొండూర్‌): ప్రజా సమస్యలు పరిష్కరించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలో పలు అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. అనంతగిరిలో రూ.1.50 కోట్లతో నిర్మించే వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. కోర్టు కేసులు పరిష్కరింపజేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అనంతరం సీఎమ్మార్‌ఎఫ్‌, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, ఫుడ్‌ కార్పొరేషన్‌ మెంబర్‌ ఓరుగంటి ఆనంద్‌, సర్పంచులు అరుకాల నవీన్‌కుమార్‌, మామిడి రాజు, చల్ల నవీన్‌రెడ్డి, ఖాత మల్లేశం, కేతిరెడ్డి భారతి, గుడిసె ఐలయ్య, వెంకటరమణారెడ్డి, ఎలగందుల ప్రసాద్‌, పసుల వెంకటి, తీగల పుష్పలత, సత్యారెడ్డి పాల్గొన్నారు.

సాక్షి బ్యూరో ఇన్‌చార్జికి ఉత్తమ జర్నలిస్టు అవార్డు1
1/2

సాక్షి బ్యూరో ఇన్‌చార్జికి ఉత్తమ జర్నలిస్టు అవార్డు

సాక్షి బ్యూరో ఇన్‌చార్జికి ఉత్తమ జర్నలిస్టు అవార్డు2
2/2

సాక్షి బ్యూరో ఇన్‌చార్జికి ఉత్తమ జర్నలిస్టు అవార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement