ప్రయాణం.. ప్రమాదం
కల్వర్టుల వద్ద కోసుకుపోయిన రోడ్లు
కనిపించని ప్రమాద సూచిక బోర్డులు
మరమ్మతు చేయని అధికారులు
ఆందోళనలో వాహనదారులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాలోని పలు రోడ్లు ప్రమాదకరంగా మారాయి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా వాహనం అదుపుతప్పుడు ఖాయం. ఇరుకు వంతెనలు.. కోసుకుపోయిన రోడ్లు.. కుంగిన కల్వర్టులతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. రోడ్లు.. కల్వర్టులకు మరమ్మతు చేయించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. నిధులు లేవని కాలం వెల్లదీస్తున్నారు. ఫలితంగా వాహనదారులు భయపడుతూనే ప్రయాణం చేస్తున్నారు.
కోసుకుపోయిన రోడ్లు
ఎల్లారెడ్డిపేట మండలంలోని వీర్నపల్లి, రాచర్లగొల్లపల్లి, కోరుట్లపేట, బండలింగంపల్లితోపాటు సిరిసిల్ల– కామారెడ్డి రహదారుల్లో పలు చోట్ల రోడ్లు కోసుకుపోయాయి. కల్వర్టుల వద్ద సగం రోడ్డు వరకు తెగిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఐదేళ్లుగా తెగిన రోడ్లకు మరమ్మతులు చేయడం లేదు.
కనిపించని సూచికబోర్డులు
ప్రధాన రహదారుల వెంట కోతకు గురైన కల్వర్టుల వద్ద అధికారులు కనీసం ప్రమాద సూచికబోర్డులను కూడా ఏర్పాటు చేయలేదు. ఫలితంగా రాత్రిపూట ప్రయాణించే వారు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తెగిపోయిన కల్వర్టులను, రోడ్లను మరమ్మతు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రయాణం.. ప్రమాదం


