శ్రీవారికి ఏకాంతసేవ
సిరిసిల్లటౌన్: శ్రీశాల క్షేత్రంలో శ్రీవారికి ఏకాంతసేవ నేత్రపర్వంగా నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దేవదేవుడికి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ఈవో మారుతిరావు, ఏఈవోలు పీసరి రవీందర్, కూనబోయిన సత్యం, అర్చకస్వాములు మాడంరాజు కృష్ణమాచారి, వర్ధనాచారి తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల నియమావళి పాటించాలి
ముస్తాబాద్(సిరిసిల్ల): ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించేలా పర్యవేక్షించాలని మోడల్ కోడ్ జిల్లా నోడల్ అధికారి శేషాద్రి ఆదేశించారు. ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లి చెక్‌పోస్టును ఆదివారం పరిశీలించి మాట్లాడారు. ఎన్నికల విధులను అధికారులు, ఉద్యోగులు పారదర్శకంగా చేయాలన్నారు. ఎంపీవో వాహిద్, ఏపీవో ఆనంద్‌మోహన్ ఉన్నారు.
పోలింగ్ కేంద్రాలు పరిశీలన
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి పోలింగ్ కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదివారం పరిశీలించారు. పోలింగ్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. సారంపల్లి, మండేపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. సీపీవో శ్రీనివాసాచారి, తహసీల్దార్ జయంత్, ఎంపీడీవో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఓటేయడం ఆనందంగా ఉంది
ఇల్లంతకుంట(మానకొండూర్): తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన బండారి రక్షిత తెలిపింది. మొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలిపింది. బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చదువుతుంది.
దుబాయ్ నుంచి ఓటేసేందుకు..
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఓటు వేయాలని ఎన్నికల సంఘం ఎంత ప్రచారం కల్పించినా.. పోలింగ్ రోజు సెలవు ఇచ్చినా పట్టణ ప్రజలు బయటకు రావడం లేదు. కానీ దుబాయ్‌లో ఉంటున్న వ్యక్తి రూ.50వేలు వెచ్చించి సొంతూరికి వచ్చాడు. తంగళ్లపల్లి మండలం పాపయ్యపల్లెకు చెందిన యువకుడు గంభీరావుపేట వేణు ఉపాధి నిమిత్తం దుబాయ్‌లో ఉంటున్నాడు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో స్వగ్రామానికి వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నాడు.
నేడు సిరిసిల్లకు కేటీఆర్
సిరిసిల్ల: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సోమవారం సిరిసిల్ల కు వస్తున్నారు. తొలి, మలి విడత పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్‌ఎస్ బలపరిచిన సర్పంచులను సన్మానించనున్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
శ్రీవారికి ఏకాంతసేవ
శ్రీవారికి ఏకాంతసేవ
శ్రీవారికి ఏకాంతసేవ


