ఎలక్షన్ కోడ్ పకడ్బందీగా అమలు
● రూ.23,28,500 నగదు సీజ్ ● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్ల క్రైం: జిల్లాలో ఎలక్షన్ కోడ్ పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే సోమవారం తెలిపారు. రెండు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయన్నారు. 98 కేసులలో 1,525 లీటర్ల మద్యం, రూ.23,28,500 నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై 11 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన, 224 కేసుల్లో 782 మందిని బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు.
ముస్తాబాద్(సిరిసిల్ల): ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా బందోబస్తు చేపట్టినట్లు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి పేర్కొన్నారు. ముస్తాబాద్ జెడ్పీ హైస్కూల్‌లోని పోలింగ్‌స్టేషన్‌లో ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. సీఐ మొగిలి, ఎస్సై గణేశ్ ఉన్నారు.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఎన్నికల్లో గెలుపోటములు సహజం. అయితే కొందరు సర్పంచ్ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను పరిశీలిస్తే.. వారి పెట్టిన ఖర్చుకు పొంతన లేకుండా ఉంది. ఎంత ప్రచారం చేసినా ఇరువై ఓట్లు కూడా దాటకపోవడంతో అవాక్కయ్యారు. తంగళ్లపల్లి మండల వ్యాప్తంగా ఆదివారం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బద్దెనపల్లిలో కొదాడి రిషితకు 8 ఓట్లు, బస్వాపూర్‌లో సర్కార్‌రెడ్డికి 9, పూర్మాణి రంగారెడ్డికి 14, చీర్లవంచలో మంజుల వరికి 13, గోపాల్‌రావుపల్లెలో పుర్సాని నాగరాజుకు 10, సగ్గుపాటి నరేశ్‌కు 19, ఎడ్ల మల్లయ్యకు 10, ఓబులాపూర్‌లో కొమ్మెట భాగ్యలతకు 15, పద్మనగర్‌లో ముడారి రాజమ్మకు 12, రాళ్లపేటలో బోయిని భానుచందర్‌కు 9, బోయిని కార్తీక్‌కు 17, రామచంద్రాపూర్‌లో తాళ్లపెల్లి పీతాంబరంగౌడ్‌కు 13, రేషం కనకయ్యకు 8 ఓట్లు మాత్రమే వచ్చాయి.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి మండలంలో రెండో దశ పంచాయతీ ఎన్నికలు ఆదివారం ముగిశాయి. అయితే చాలా మంది ఓటర్లకు ఓటు వేయడం రాలేదు. దీంతో చాలా ఓట్లు రిజెక్ట్ అయ్యాయి. తంగళ్లపల్లి మండల కేంద్రంలో 114 ఓట్లు, ఇందిరమ్మకాలనీలో 92, జిల్లెల్లలో 51 ఓట్లు రిజెక్ట్ అయ్యాయి. అంతేకాకుండా మండల వ్యాప్తంగా నోటాకు 99 ఓట్లు పోల్‌కావడం గమనార్హం.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని జిల్లెల్ల గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఒకటో వార్డు సభ్యురాలిగా పోటీచేసిన ఉడుతల కవితను టాస్ రూపంలో అదృష్టం వరించింది. ఒకటోవార్డులో మొత్తం 297 ఓట్లు ఉండగా 250 ఓట్లు పోల్ కాగా.. 7 ఓట్లు చెల్లలేదు, 3 ఓట్లు నోటాకు వేశారు. దీంతో పోటీపడిన తాళ్లపెల్లి అంజవ్వ, ఉడుతల కవితలకు చెరో 120 ఓట్లు వచ్చాయి. దీంతో పోలింగ్ అధికారులు టాస్ వేయగా.. అదృష్టం కవితను వరించడంతో వార్డు సభ్యురాలిగా ఎన్నికై ంది.
సిరిసిల్లటౌన్: సీఐటీయూ అఖిల భారత 18వ మహాసభలను విజయవంతం చేయాలని యూనియన్ నాయకులు కోరారు. ఈమేరకు సిరిసిల్లలోని అమృత్‌లాల్‌శుక్లా కార్మికభవన్ వద్ద యూనియాన్ జెండాను ఆవిష్కరించారు. జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ ఈనెల 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరిగే అఖిల భారత 18వ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. సూరం పద్మ, అన్నల్‌దాస్ గణేశ్, దాసరి రూప, బెజుగం సురేష్, జిందం కమలాకర్, సుల్తాన్ నర్సయ్య, గడ్డం రాజశేఖర్, బింగి సంపత్, సూరం వీరేశం పాల్గొన్నారు.
ఎలక్షన్ కోడ్ పకడ్బందీగా అమలు
ఎలక్షన్ కోడ్ పకడ్బందీగా అమలు


