
సాయుధ రైతాంగ పోరాట వీరుడు లచ్చన్న
స్వగ్రామానికి మృతదేహాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సిరిసిల్ల రైతాంగ సాయుధ పోరాటంలో కామ్రేడ్ లచ్చన్న చురుకై న పాత్ర పోషించారని సీపీఐ రాష్ట్ర నాయకుడు గుంటి వేణు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌లో శనివారం అనారోగ్యంతో మృతిచెందిన తాళ్లపల్లి లచ్చన్న(75) అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు. అంతిమయాత్రలో దారిపొడవునా కామ్రేడ్ లచ్చన్న అమరహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ, బాల్యంలోనే లచ్చన్న ముంబాయ్ వెళ్లి విప్లవ కార్మికవర్గ నాయకుడిగా ఎంతోమందిని ఉద్యమమం వైపు నడిపించారన్నారు. తాను పని చేస్తున్న కంపెనీలో యూనియన్ ఏర్పాటు చేసి తొ లుత ఐఎఫ్‌టీయూ, ఏఐఎఫ్‌టీయూ నాయకుడిగా ఎదిగారన్నారు. ప్రజా సంఘాల నాయకులు ల చ్చన్న మృతదేహంపై ఎర్రజెండా కప్పి విప్లవ జో హార్లు తెలిపారు. ‘తరమెల్లి పోతుంది.. త్యాగాల స్వారాగం.. ఆగిపోతుంది.. ఓ వీరులారా.. ఓ సూ రులారా.. వందనాలు.. ఎర్ర వందనాలు’.. అంటూ విప్లవ గీతాలు ఆలపించి లచ్చన్నకు చివరి వీడ్కోలు పలికారు. అరుణోదయ కళాకారిణి విమలక్క సెల్ ఫోన్ ద్వారా విప్లవ సందేశాన్ని అక్కడికి వచ్చిన వారందరికీ వినిపించారు. ప్రజా సంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
అదృశ్యమైన యువకుడి మృతదేహం
చందుర్తి(వేములవాడ): బతుకమ్మ ఆట చూసి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన యువకుడు 20 రోజులకు పాడుబడిన వ్యవసాయబావిలో కుళ్లిన స్థితిలో కనిపించాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని జోగాపూర్ గ్రామానికి చెందిన మట్టేల తిరుపతి (30) గత నెల 29న సద్దుల బతుకమ్మ ఆట చూసి వస్తానని తల్లి భాగ్యవ్వకు చెప్పి వెళ్లాడు. 24 గంటలు గడిచినా కుమారుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో అదే నెల 30న భాగ్యవ్వ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అదృశ్యం కేసు నమోదు చేశారు. కాగా జోగాపూర్ పక్క గ్రామం కిష్టంపేటకు చెందిన పూడూరి బాపురావు వ్యవసాయ బావిలో కుళ్లిన స్థితిలో తిరుపతి మృతదేహం లభ్యమైంది. బాపురావు చిన్న కుమారుడు మహేశ్ బావికి సమీపంలో గేదెను కట్టేసేందుక వెళ్లగా కుళ్లిన మృతదేహంపై షర్టు కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కాగా తిరుపతి కొద్దిరోజులుగా మతి స్థిమితం సరిగా లేక బావిలో పడి మృతిచెంది ఉంటాడని పోలీసులు, గ్రామస్తులు భావిస్తున్నారు.
రామడుగు/మేడిపల్లి: ఉపాధి కోసం ఒకరు.. ఉన్నత చదువుల కోసం మరొకరు విదేశాలకు వెళ్లి.. ఇటీవల గుండెపోటుతో మృతిచెందగా, వారి మృతదేహాలను ఆదివారం స్వగ్రామాలకు తీసుకొచ్చారు. వివరాలు.. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్‌రావుపేట గ్రామానికి చెందిన ఎలగుందుల ప్రకాశ్ (35) కొద్దిరోజులుగా దుబాయ్‌లో కంపెనీలో కాకుండా కలివెల్లిగా జీవనం సాగించాడు. ఇటీవల గుండెపోటుతో మృతిచెందాడు. అతడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడం కష్టంగా మారింది. దీంతో కుటుంబ సభ్యులతోపాటు, బీఆర్‌ఎస్ నాయకులు పూడురి మల్లేశం, దుబాయి ఎల్లాల శ్రీనన్న సేవా సమితి సభ్యులు చిలుముల రమేశ్‌కు తెలిపారు. ఈక్రమంలో రమేశ్ సేవా సమితి అధ్యక్షుడు రవిడేవిడ్‌కు తెలియజేయడంతో దుబాయ్‌లోని ఇండియన్ అసోసియేషన్ వారితో మాట్లాడారు. దీంతో ప్రకాశ్ మృతదేహాన్ని ఆదివారం స్వగ్రామానికి తీసుకురాగా, పలువురు శ్రద్ధాంజలి ఘటించారు.
ఉన్నత చదువుల కోసం వెళ్లి..
లండన్‌లో ఈనెల 3న గుండెపోటుతో చనిపోయిన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేట కు చెందిన ఏనుగు మహేందర్‌రెడ్డి (26) మృతదేహాన్ని ఆదివారం స్వగ్రామానికి తీసుకొచ్చారు. ఉ న్నత చదువుల కోసం లండన్ వెళ్లిన మహేందర్‌రెడ్డి విగతజీవిగా మారడ ంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతడి తండ్రి రమేశ్‌రెడ్డి కాంగ్రెస్ మేడిపల్లి మండల అధ్యక్షుడు కావడంతో పెద్దసంఖ్యలో ప్రజలు, ప్రముఖులు మహేందర్‌రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్నారు.
గల్ఫ్‌లో గొల్లపల్లి వాసి మృతి
ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లికి చెందిన ఆకుల శ్రీకాంత్‌గౌడ్(35) అనే యువకుడు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ గల్ఫ్‌లో ఆదివారం రాత్రి మృతిచెందాడు. ఈ సంఘటన స్వగ్రామంలో విషాదం నింపింది. వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీకాంత్‌గౌడ్ కొంతకాలంగా గల్ఫ్ దేశాలకు బతుకుదెరువు కోసం వెళ్తున్నాడు. మొదట అఫ్గానిస్థాన్‌కు వెళ్లిన శ్రీకాంత్‌గౌడ్ ప్రస్తుతం ఒమన్ దేశంలో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం గల్ఫ్ నుంచి ఇంటికొచ్చి తిరిగి వెళ్లాడు. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించి ఆదివారం మృతిచెందాడు. శ్రీకాంత్‌గౌడ్ మృతి చెందిన సమాచారాన్ని అక్కడ మిత్రులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఒక్కగానొక్క ఒక్క కొడుకు మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతునికి తల్లిదండ్రులు లక్ష్మి–అంజాగౌడ్ ఇద్దరు సోదరీలు ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
చందుర్తి: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వచ్చిన బ్లూకోల్ట్స్ సిబ్బందికి ఇసుక స్మగ్లర్ చుక్కలు చూపించాడు. ట్రాక్టర్‌ను ఠాణాకు తరలించేందుకు పోలీస్ సిబ్బంది అరగంట సేపు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో చివరికి ఏఎస్సై వచ్చి సదరు ఇసుక రవాణాదారుడిని అదుపులోకి తీసుకుని ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వివరాలు స్థానికులు తెలిపిన కథనం ప్రకారం. చందుర్తి మండలం లింగంపేటకు చెందిన ఒకరు తన ట్రాక్టర్‌లో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా బ్లూకోల్ట్స్ సిబ్బంది పట్టుకున్నారు. ట్రాక్టర్‌ను ఠాణాకు తరలించకుండా యజమాని అడ్డుకోవడంతో అరగంటకు పైగా చిన్నపాటి డ్రామ చోటుచేసుకుంది. యజమాని సహకరించకపోవడంతో చివరికి ఏఎస్సై చంద్రశేఖర్‌కు సమాచారం ఇవ్వడంతో సిబ్బందితో వచ్చి పోలీసు వాహనం సహాయంతో లింగంపేటకు వెళ్లి ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మండల కేంద్రంలోని ఓ అధికార పార్టీ నేతకు సదరు ట్రాక్టర్ యజమాని ఫోన్‌చేయగా, ఇప్పటికే మూడు సార్లు విడిపించానని.. ఇక తనతో కాదని ఫోన్ పెట్టేసినట్లు చర్చ సాగుతోంది.
అంతిమయాత్రలో ఎర్రజెండాలతో నినాదాలు

సాయుధ రైతాంగ పోరాట వీరుడు లచ్చన్న

సాయుధ రైతాంగ పోరాట వీరుడు లచ్చన్న

సాయుధ రైతాంగ పోరాట వీరుడు లచ్చన్న

సాయుధ రైతాంగ పోరాట వీరుడు లచ్చన్న

సాయుధ రైతాంగ పోరాట వీరుడు లచ్చన్న