
ఈడబ్ల్యూఎస్ తరహాలో బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలి
● బీజేపీ మంత్రులు, ఎంపీలు అఽధిష్టానాన్ని ఒప్పించాలి ● సిరిసిల్లలో మంత్రి పొన్నం ప్రభాకర్
సిరిసిల్లటౌన్: ఈడబ్ల్యూఎస్‌కు రాని యాభై శాతం అడ్డు బీసీ రిజర్వేషన్లకు ఎలా ఆపాదిస్తారని బీజేపీ నాయకులను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. సిరిసిల్లకు ఆది వారం వచ్చిన ఆయనను స్థానిక కాంగ్రెస్ నేతలు ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి పొన్నం మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇ వ్వాలని కాంగ్రెస్ ప్ర భుత్వం మొదటి నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి మోకాలడ్డుతుందని విమర్శించారు. తమిళనాడులో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పీవీ నరసింహరావు ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష మేరకు సానుకూలంగా స్పందించిన విషయాన్ని బీజేపి సర్కారు గుర్తెరుగాలన్నారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డితోపాటు బీజేపీ ఎంపిలు, పార్టీ జిల్లా అధ్యక్షులు అందరూ కలిసి అధిష్టానాన్ని ఒప్పించాలని కోరారు. కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, టీపీసీసీ అబ్జర్వర్ సంగీతం శ్రీనివాస్, ఆకునూరి బాలరాజు, గడ్డం నర్సయ్య, కత్తెర దేవదాసు, సూర దేవరాజు, గోలి వెంకటరమణ, ఆడెపు ప్రభాకర్ పాల్గొన్నారు.