
ఊరంతా ఆధ్యాత్మికం!
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): అక్కడ క్రీస్తుకు పూర్వమే స్వయంభూగా వెలసిన అనేక ఆలయాలు ఉన్నాయి. ఊరుఊరంతా భక్తిశ్రద్ధలతో దేవుళ్లను పూజిస్తున్నారు.. ఆధ్యాత్మికత పంచుతున్నారు గర్రెపల్లిల గ్రామస్తులు.. క్రీస్తుకు పూర్వమే 100 ఏళ్ల నుంచి 400ఏళ్ల క్రితం నిర్మించినట్లు చెబుతున్న ప్రాచీన ఆలయాలు.. శ్రీరాజరాజేశ్వరస్వామి, శ్రీవేణుగోపాలస్వామి, శ్రీభక్తంజనేయస్వామి, శ్రీదూర్గామాత ఆ గ్రామం చుట్టూ ఉన్నాయి. ఆనాటి నుంచి నేటి వరకూ భక్తుల ఆదరణ తగ్గకపోగా.. రోజురోజుకూ పెరుగుతోంది. కొలిచిన వారి కోర్కెలు తీర్చుతున్నారని భక్తుల్లో ప్రగాఢ నమ్మకం ఉంది. భక్తుల నుంచి ఆదరణ పెరుగుతున్నా.. ఆలయాల అభివృద్ధిపై ప్రభుత్వాలు దృష్టి సారించడంలేదు.
ఆధ్యాత్మికం
క్రీస్తుకు పూర్వం దాదాపు 200 ఏళ్లక్రితం గర్రెపల్లిలో శ్రీవేణుగోపాలస్వామి ఆలయం నిర్మించినట్లు చెబుతున్నారు. భక్తుల నుంచి అసాధారణ ఆదరణ ఉన్న శ్రీవేణుగోపాలుడిని దర్శించుకుంటే అంతామంచే జరుగుతోందని భక్తుల నమ్మకం. స్వామివారికి క్రమంగా ఆదరణ పెరుగుతూ వస్తోంది.
గ్రామ శివారులోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం క్రీస్తుకు పూర్వం సుమారు 400 ఏళ్లక్రితం వెలిసినట్లు వేదపండితులు చెబుతున్నారు. అంతటి ఘనచరిత్ర కలిగిన స్వామి వారు.. కొలిచిన భక్తులకు కొంగుబంగారంలా ఉంటున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. రోజు వందల మంది భక్తులు దర్శించుకుంటున్నా అభివృద్ధికి నోచుకోవడంలేదు.

ఊరంతా ఆధ్యాత్మికం!

ఊరంతా ఆధ్యాత్మికం!