
నేడు ధర్మపురికి ‘చాగంటి’
ధర్మపురి: ధర్మపురి పుణ్యక్షేత్రంలో ఈనెల 11,12వ తేదీల్లో నిర్వహించే ఆధ్యాత్మిక ప్రవచనముల కార్యక్రమానికి చాగంటి కోటేశ్వర్‌రావు రానున్నారు. ఈసందర్భంగా ఆలయం ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక బ్రాహ్మణ సంఘం పక్కనున్న శ్రీమఠం స్థలంలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భక్తులు భారీ ఎత్తున రానున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు. స్వాగత తోరణం, హనుమాన్ విగ్రహం, నందికూడలి వద్ద రంగురంగుల లైట్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తదితరులు హాజరు కానున్నారు.
అన్నదాన ట్రస్ట్‌కు రూ.1.11 లక్షల విరాళం
వేములవాడ: వేములవాడ రాజన్న అన్నదాన ట్రస్ట్‌కు హైదరాబాద్ సోమాజిగూడకు చెందిన నీలగిరి శంకరరావు కుటుంబ సభ్యులు శుక్రవారం రూ.1.11 లక్షల విరాళం ఆలయ అధికారులకు అందజేశారు. ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శన అవకాశం కల్పించారు. అనంతరం ప్రసాదాలు అందించి ఆశీర్వచనం గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డీఈ రఘునందన్, ఏఈవో శ్రావణ్‌కుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు.
రూ. 3 లక్షల విరాళం...
సిరిసిల్లకు చెందిన జోగినపెల్లి స్రవంతి–వెంకటకిరణ్ కుటుంబ సభ్యులు వేములవాడ రాజన్న ఆలయ అన్నదానం ట్రస్టుకు రూ. 3 లక్షల విరాళాన్ని ఆలయ ఈవో రమాదేవికు శుక్రవారం అందజేశారు. ఆలయ ఏఈవో బ్రహ్మన్నగారి శ్రీనివాస్, అకౌంట్ అడ్వైజర్ ఆగంరావు, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఆర్థిక సమస్యలతో వివాహిత ఆత్మహత్య
మల్యాల(చొప్పదండి): ఆర్థిక సమస్యలతోపాటు ఒంటరి తనం భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన నూకపల్లి డబుల్ బెడ్ రూం కాలనీలో జరిగింది. ఎస్సై నరేశ్‌కుమార్ కథనం ప్రకారం.. నూకపల్లి డబుల్‌బెడ్ రూం కాలనీలో నివాసముంటున్న అన్వరి బేగం (47) కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో పాటు ఒంటరితనంతో బాధపడుతోంది. భర్త అబ్దుల్ రషీద్ కొంతకాలంగా జైలులో ఉంటున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన అన్వరి బేగం శుక్రవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుమారుడు అఖిల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
భూవివాదంలో మనస్తాపంతో..
జూలపల్లి(మంథని): పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన బట్టు సురేశ్(40) భూవివాదంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి సత్తయ్య కథనం ప్రకారం.. సురేశ్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాచాపూర్ గ్రామానికి చెందిన బట్టు లక్ష్మణ్‌కు, సురేశ్‌కు మధ్య కొంతకాలంగా భూవివాదం నడుస్తోంది. దీనివిషయంలో ఇప్పటికే పంచాయితీలు, పోలీస్ కేసుల వరకూ వెళ్లారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో మానసికంగా మనస్తాపం చెందిన సురేశ్.. శుక్రవారం ఇంట్లో లుంగీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సనత్‌కుమార్ తెలిపారు.

నేడు ధర్మపురికి ‘చాగంటి’

నేడు ధర్మపురికి ‘చాగంటి’