
నేడు భీమన్న గుడిలోకి ఉత్సవమూర్తులు
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణలో భాగంగా శనివారం ఉదయం శుభముహూర్తం ఉండటంతో స్వామి వారి ఉత్సవమూర్తులను భీమన్న గుడిలోకి తీసుకొస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. కోడె మొ క్కులు, ఆర్జిత సేవలు, అభిషేకాలు, అన్నపూజ, కుంకుమపూజ, నిత్యకల్యాణం, చండీహోమం కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేస్తారని అన్నారు. అయితే రాజన్న ఆలయంలో నిత్య కై ంకర్యాలు, చతుష్కాల పూజలు, ఆ లయ అర్చకులతో యథావిధిగా జరుగాయని పేర్కొన్నారు. ఈనెల 19, 20వ తేదీల్లో శృంగేరిపీఠాధిపతుల పర్యటన అనంతరం భీమన్నగుడిలోనే భక్తుల దర్శనాలు, పూజలు, మొక్కులు నిర్వహించనున్నట్లు తెలిసింది.
వినూత్న నిరసన
సిరిసిల్లటౌన్ : జీవో నం.9పై హైకోర్టు ఇచ్చిన స్టేను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని దానిని ఎత్తివేయించాలని, దీనికి బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు కోర్టులో 42శాతం రిజర్వేషన్లకు మద్దతుగా నిలవాలని కోరుతూ శుక్రవారం సిరిసిల్ల అంబేడ్కర్ చౌరస్తాలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు కళ్లకు గంతలు కట్టుకొని వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బీసీలకు 42శాతం రిజర్వేషన్లకై పోరాటాలు చేపడుతామని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శహన్మాండ్లు పట్టణ అధ్యక్షుడు కమలాకర్, జిల్లా అధికార ప్రతినిధి బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
13న నల్లబ్యాడ్జీలతో నిరసన
సిరిసిల్ల అర్బన్: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ ఈనెల 13న కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి పుట్ట రవి అన్నారు. శుక్రవారం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ, వీహెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే నిరసనలో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 17న జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో నిరసన ర్యాలీలు, 22న చలో హైదరాబాద్ చేపట్టామని తెలిపారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు ఆవునూరి ప్రభాకర్, జిల్లా నాయకులు యెలగందుల బిక్షపతి, ఖా నాపురం లక్ష్మణ్, లచ్చన్న, వీహెచ్‌పీఎస్ జిల్లా కన్వీనర్ శోభరాణి, అన్ని మండలాల అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
హామీల పేరిట మోసం
గంభీరావుపేట: హామీలు, ఆరు గ్యారంటీల పేరిట కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు అన్నారు. శుక్రవారం గంభీరావుపేటలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల చేసి మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలకు కాంగ్రెస్ బాకీ పడిందన్నారు. హామీలపై కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకటస్వామిగౌడ్, సెస్ డైరెక్టర్ నారాయణరావు, కొమిరిశెట్టి లక్ష్మణ్, రాజు, రాజిరెడ్డి, వెంకటి, వేణు, వెంకటస్వామి పాల్గొన్నారు.
మానసిక స్థితిగతులపై అవగాహన అవసరం
వేములవాడ: చేనేత వస్త్ర పరిశ్రమ కేంద్రాల్లో కార్మికుల జీవన విధానంలో మార్పులు, మానసిక స్థితిగతులపై అవగాహన అవసరమని జిల్లా సైకాలజిస్ట్ పురుషోత్తం ఈశ్వర్ అన్నారు. లయన్స్ క్లబ్ అవేర్‌నెస్‌లో భాగంగా శుక్రవారం పట్టణంలోని చేనేత సహకార సంస్థ భవనంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ చేనేత కార్మికులు మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న తరుణంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అవగా హన సదస్సులు కార్మికుల మనోభావాలు దె బ్బతినకుండా ఉండటానికి తోడ్పడుతాయని తెలిపారు. లయన్స్‌క్లబ్ అధ్యక్షులు చీకోటి సంతోష్, కొలిపాక నర్సయ్య, చేనేత సహకార సంస్థ ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.

నేడు భీమన్న గుడిలోకి ఉత్సవమూర్తులు

నేడు భీమన్న గుడిలోకి ఉత్సవమూర్తులు