
సర్వీసులు పెంచాలి
సిద్దిపేట, కామారెడ్డి రూట్‌లో గంటల తరబడి బస్‌ల కోసం వేచి ఉంటున్నాం. మహిళలు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. గంభీరావుపేట వద్ద బ్రిడ్జి లేకపోవడంతో దూరం పెరిగింది. అధిక చార్జీ వసూలు చేస్తున్నారు. వంతెన నిర్మించి బస్ సర్వీసులను పెంచాలి.
– కుర్ర సావిత్రి, ముస్తాబాద్
రెండు గంటలుగా బస్ లేదు
మాది హైదరాబాద్. ముస్తాబాద్ మండలంలో ఉన్న బంధువుల వద్దకు వచ్చాం. హైదరాబాద్‌కు వెళ్లేందుకు ముస్తాబాద్‌లో రెండు గంటలు ఉన్నాం. సిద్దిపేటకు వెళ్లే బస్ వచ్చినా అందులో అడుగు పెట్టె సందు లేదు. అధికారులు స్పందించి బస్‌లను పెంచాలి.
– లక్ష్మి, హైదరాబాద్
వంతెనలు లేక ఇబ్బంది
సిద్దిపేట–కామారెడ్డి రూట్‌లో 14 బస్ సర్వీసులు నడుపుతున్నాం. గంభీరావుపేట వద్ద బ్రిడ్జి లేకపోవడంతో దూరం పెరిగింది. వర్షకాలంలో ఏటా ఈ రూట్ సమస్యగా మారింది. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు బస్‌లను నడుపుతున్నాం.
– రఘు, డిపో మేనేజర్, సిద్దిపేట

సర్వీసులు పెంచాలి