
మహిళలు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి
సిరిసిల్ల: మహిళలు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్య త ఇవ్వాలని సైకాలజిస్ట్ కె.పున్నంచందర్ కోరారు. స్థానిక సుందరయ్యనగర్‌లో మానసిక ఆరోగ్య దినో త్సవం సందర్భంగా సిరిసిల్ల జనరల్ ఆస్పత్రి మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గురువారం సామూహిక కౌన్సెలింగ్ నిర్వహించారు. సైకాలజిస్ట్ పున్నంచందర్ మాట్లాడుతూ మహిళలు కుటుంబం, ఉద్యోగం, సామాజిక బాధ్యతలు, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత సాధించడంలో ఒత్తిడి ఎదుర్కొంటున్నారన్నారు. సరైన నిద్ర, ఆరో గ్యకరమైన ఆహారం, వ్యాయామం, యోగా ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చన్నారు. మైండ్‌కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ సిబ్బంది రాపెల్లి లత, బూర శ్రీమతి, కొండ ఉమ ఉన్నారు.