
శ్రీవారికి చక్రస్నానం.. పుష్పయాగం
సిరిసిల్లటౌన్: శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి నిర్వహించిన ఏకాంతసేవతో ముగిశాయి. ఆలయంలోని శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి, భూదేవి సహితంగా వేంకటేశ్వరస్వామికి చక్రస్నానం చేయించారు. రాత్రి మహాపుష్పయాగం నిర్వహించారు. ప్రసాద్ దంపతులు 15 రకాల పుష్పాలు 430 కిలోలు అందించగా.. వేదపండితులు పుష్పార్చన చేశారు. బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు ఆలయ ప్రధానార్చకులు కృష్ణమాచారి ప్రకటించారు. టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, ఆలయ ఈవో మారుతిరావు, ఏఈవోలు కూనబోయిన సత్యం, పీసరి రవీందర్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు ఉప్పుల విఠల్‌రెడ్డి, తీగల శేఖర్‌గౌడ్, చేపూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
దర్శించుకుంటున్న భక్తులు
మహాపుష్పయాగం నిర్వహిస్తున్న వేదపండితులు