
వాల్మీకి జీవితం ఆదర్శం
సిరిసిల్లక్రైం: వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని ఎస్పీ మహేశ్ బీ గీతే అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వాల్మీకి జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కృషి, నిబద్ధత ఉంటే మనిషి ఋషిగా, మహానుభావుడిగా మారగలడన్న దానికి వాల్మీకి జీవితం నిలువెత్తు నిదర్శనం అన్నారు. ఏఎస్పీ చంద్రయ్య, సీఐలు రవి, నాగేశ్వరరావు, ఆర్‌ఐ రమేశ్, ఏవో పద్మ, సిబ్బంది పాల్గొన్నారు.
రాజన్న సేవలో జిల్లా జడ్జి
వేములవాడ: జిల్లా జడ్జి టి.నీరజ మంగళవారం రాజన్నను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న జడ్జికి వేములవాడ సబ్ జడ్జి అజయ్‌కుమార్ జాదవ్, జూనియర్ సివిల్ జడ్జి ప్రవీమ్‌కుమార్ ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
డీపీసీ ద్వారా ధరలు నిర్ణయించాలి
సిరిసిల్ల /సిరిసిల్లఅర్బన్: జిల్లాలోని గురుకుల విద్యాలయాలు, హాస్టళ్లకు కూరగాయలు, పండ్లు, గుడ్లు, చికెన్, మటన్ సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లకు చెల్లించే ధరలను జిల్లా పర్చేజ్ కమిటీ (డీపీసీ) ఏర్పాటు చేసి నిర్ణయించాలని గురుకుల కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు అ దనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌కు వినతిపత్రం అందించారు. పెండింగ్‌లో ఉన్న ఆరునెలల బిల్లులు ఇప్పించాలన్నారు. అధ్యక్షుడు యాదగిరి, ప్రతినిధులు జేఎస్ రావు, బాల్‌రెడ్డి, మల్లేశ్, మహేశ్, రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
జిల్లాను వీడని ముసురు
సిరిసిల్ల: జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు వర్షం కురిసింది. కోనరావుపేటలో అత్యధికంగా 30.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రుద్రంగి 18.2, చందుర్తి 10.1, వేములవాడరూరల్ 10.5, బోయినపల్లి 2.0, వేములవాడ 1.7, సిరిసిల్ల 0.3, వీర్నపల్లి 21.7, ఎల్లారెడ్డిపేట 15.1, గంభీరావుపేట 13.6, ముస్తాబాద్ 1.7, ఇల్లంతకుంటలో 0.2 మి.మీ వర్షం కురిసింది.
అంకితభావంతో విధులు నిర్వర్తించాలి
చందుర్తి(వేములవాడ): వైద్య సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించి గుర్తింపు తెచ్చుకోవాలని డీఎంహెచ్‌వో ఎస్ రజిత కోరారు. మంగళవారం చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది హాజరు పట్టిక, రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆశ డే సంసదర్భంగా ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలతో మాట్లాడారు. రోగులతో మర్యాదగా వ్యవహరించి వైద్య సేవలు అందించాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్.అంజలినా ఆల్ఫ్రెడా, వైద్యులు సంపత్‌కుమార్, రామకృష్ణ, పీహెచ్‌సీ వైద్యాధికారి వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మద్యం దుకాణాలకు 13 దరఖాస్తులు
సిరిసిల్లక్రైం: జిల్లాలోని 48 మద్యం దుకాణాలకు ఇప్పటివరకు 78 దరఖాస్తులు వచ్చాయని ఎకై ్సజ్ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం 13 దరఖాస్తులు స్వీకరించినట్లు వివరించారు. దరఖాస్తులకు గడువు 11 రోజులు ఉందని పేర్కొన్నారు.