
గ్రాడ్యుయేషన్ డే
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం అగ్రహారం శ్రీరాజరాజేశ్వరస్వామి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2022–2025 విద్యాసంవత్సరంలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మంగళవారం సర్టిఫికెట్లు ప్రధానం చేసి గ్రాడ్యుయేషన్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రభాకరచారి మాట్లాడుతూ, విషయ పరిజ్ఞానాన్ని సంపాదించి భవిష్యత్‌లో ఉన్నత స్థాయిలోకి రావాలన్నారు. విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ రాజగోపాల్ తండ్రి భాగ్యనగర్ ప్రభాకర్ జ్ఞాపకార్థం కళాశాలలో స్మారక ప్రతిభ అవార్డును ప్రారంభించారు. అందులో భాగంగా విద్యార్థిని తిరునహారి సాయి సంహిత ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగంలో ప్రతిభ కనబరిచినందున రూ.10 వేల చెక్కు బహుమతిగా అందజేశారు. రామసుబ్బరెడ్డి, రమేశ్, మాణిక్యం, రవీందర్, శంకరయ్య, విష్ణుకుమార్, శరణ్య తదితరులు ఉన్నారు.