
జాతీయ న్యాయ విజ్ఞాన సదస్సుకు ఎంపిక
సిరిసిల్లకల్చరల్: ఢిల్లీలో నవంబర్ 8,9 తేదీల్లో జరిగే జాతీయ విజ్ఞాన సదస్సుకు జిల్లా నుంచి ఇద్దరు న్యాయవాదులు ఎంపికయ్యారు. న్యాయ సహాయ డెలివరీ మెకానిజాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ఈ సదస్సుకు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్, ప్యానల్ అడ్వకేట్లు, పారా లీగల్ వాలంటీర్ల నుంచి ఇద్దరి చొప్పున ప్రతినిధులను ఆహ్వానించారు. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ సూచన ప్రకారం జిల్లా నుంచి అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్‌గా పని చేస్తున్న ఇ. జ్యోతి, ప్యానల్ అడ్వకేట్ ఆర్.అరుణను ప్రతిపాదించినట్లు డీఎల్‌ఎస్‌ఏ జిల్లా కార్యదర్శి రాధికా జైస్వాల్ తెలిపారు. ఈ మేరకు ఎంపికై న న్యాయవాదులు మంగళవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సదరు న్యాయవాదులను ఆమె అభినందించారు.