
అండర్ 19 ఎస్జీఎఫ్ క్రీడా సంబురం
పోటీలను ఘనంగా నిర్వహిస్తాం
● రేపటి నుంచి నవంబర్ 7వరకు
జరగనున్న పోటీలు
● షెడ్యుల్ విడుదల చేసిన డీఐఈవో, ఎస్జీఎఫ్ అండర్– 19 కార్యదర్శి
కరీంనగర్‌స్పోర్ట్స్: కళాశాలల క్రీడా సంబురం ఆరంభమైంది. ఇప్పటికే స్కూల్ గేమ్స్‌తో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్రీడా వాతావరణం నెలకొనగా గురువారం నుంచి అండర్ 19 సందడి మొదలు కానుంది. 2025–26 విద్యాసంవత్సరానికి కళాశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో జరుగనున్న పోటీలకు సంబంధించిన షెడ్యుల్‌ను మంగళవారం డీఐఈవో వి.గంగాధర్, అండర్ 19 కార్యదర్శి జి మధుజాన్సన్‌లు విడుదల చేశారు. గురువారం నుంచి నవంబర్ 7 వరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోటీలను అట్టహాసంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీలకు సంబంధించిన ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
నేరుగా పోటీలు..
కళాశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో జరుగనున్న పోటీలను నేరుగా ఉమ్మడి జిల్లాస్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి మధు జాన్సన్ తెలిపారు. ఉమ్మడి జిల్లా పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్రస్థాయిలో పాల్గొనే ఉమ్మడి కరీంనగర్ జట్టుకు ఎంపిక చేయనున్నామని అన్నారు.
పోటీలు నిర్వహించే వేదిక.. తేదీలు ఇలా..
ఈనెల 18న జగిత్యాల పొన్నాల గార్డెన్‌లో బాక్సింగ్, కరాటే, తైకై ్వండో, తాంగ్‌తా (బాలబాలికలు), 19న కొత్తపల్లి అల్ఫోర్స్‌లో 19న చెస్, యోగా (బాలబాలికలు), 20న కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో పుట్‌బాల్ (బాలురు), అక్టోబర్ 6న కొత్తపల్లిలోని అల్ఫోర్స్ కాలేజీలో వుషూ, జూడో (బాలబాలికలు). 7న కొత్తపల్లి అల్ఫోర్స్‌లో కబడ్డీ (బాలురు), 8న చింతకుంట గురుకుల కళాశాలలో కబడ్డీ (బాలికలు), 9న తిమ్మాపూర్‌లోని శ్రీచైతన్య కళాశాలలో వాలీబాల్ (బాలురు).10న చింతకుంట గురుకుల కళాశాలలో వాలీబాల్ (బాలికలు). 13న కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్(బాలబాలికలు). 15న కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలలో రెజ్లింగ్ (బాలబాలికలు). 16న కొత్తపల్లి అల్ఫోర్స్‌లో హ్యాండ్‌బాల్ (బాలబాలికలు). 17న జగిత్యాల మినీ స్టేడియంలో క్రికెట్(బాలబాలికలు), 18న కొత్తపల్లి అల్ఫోర్స్‌లో టేబుల్ టెన్నీస్ (బాలబాలికలు), 23న గోదావరిఖని జేఎన్ స్టీడియంలో స్కేటింగ్, వెయిట్ లిఫ్టింగ్(బాలబాలికలు).24న కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో ఖోఖో(బాలురు). 25న కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో ఖోఖో(బాలికలు). 26న కొత్తపల్లి తేజస్ కళాశాలలో బాస్కెట్‌బాల్ (బాలబాలికలు). 28న జగిత్యాల మినీ స్టేడియంలో ఫెన్సింగ్, సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్ (బాలబాలికలు). 29న కొత్తపల్లి అల్ఫోర్స్‌లో స్విమ్మింగ్ (బాలబాలికలు). 31న కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో హాకీ (బాలబాలికలు). కరీంనగర్ శాతవాహన వర్సిటీలో నవంబర్ 4న సైక్లింగ్ (బాలబాలికలు). 6న కొత్తపల్లి తేజస్ కళాశాలలో ఆర్చరీ (బాలబాలికలు). 7న జగిత్యాల మినీ స్టేడియంలో రగ్బీ (బాలబాలికలు). 7న జగిత్యాల క్లబ్‌లో లాన్ టెన్నీస్, బ్యాడ్మింటన్, షూటింగ్ (బాలబాలికలు). 7న జగిత్యాల మినీ స్టేడియంలో ఫుట్‌బాల్ (బాలికలు).
ఉమ్మడి జిల్లా కళాశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో జరుగనున్న పోటీలను అందరి సహకారంతో ఘనంగా నిర్వహిస్తాం. క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొని పోటీలను విజయవంతం చేయాలి. ఎస్జీఎఫ్ నిబదనలు ప్రతిఒక్కరూ పాటించాలి. అండర్ 19 రాష్ట్ర పోటీల్లో కరీంనగర్ జట్టు చాంపియన్‌గా నిలువాలనే లక్ష్యంతో పోటీలను నిర్వహిస్తాం.
– జి.మధుజాన్సన్, అండర్ 19 ఉమ్మడి జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి

అండర్ 19 ఎస్జీఎఫ్ క్రీడా సంబురం