
అర్జీలు పరిష్కరించండి
● జాప్యం చేయొద్దు ● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ● ప్రజావాణిలో 185 దరఖాస్తుల స్వీకరణ
సిరిసిల్లఅర్బన్: ప్రజావాణి అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, డీఆర్డీవో శేషాద్రిలతో కలిసి అర్జీలను స్వీకరించారు. మొత్తం 185 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టవద్దన్నారు.