
ఆలయ విస్తరణ పనులు ప్రారంభం
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా మంగళవారం నుంచి గుడి చెరువులోని భవనాల కూల్చివేతలు ప్రారంభించారు. ఇందులో జరిగే నిత్యకల్యాణాలు, సత్యనారాయణవ్రతాలు, హోమాలను ఓపెన్‌స్లాబ్‌లోకి మార్చారు. భక్తులు తలనీలాలు సమర్పించుకునే కల్యాణకట్టను త్వరలో కూల్చేయనున్నారు. భీమేశ్వరాలయంలో దర్శనాలకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి.
వేములవాడ: రాజన్న ఆలయంలోని పలు విభాగాలను ఈవో రమాదేవి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. సెంట్రల్ గోదాం, లడ్డు ప్రసాదం కౌంటర్, ప్రధాన బుకింగ్ కౌంటర్‌తోపాటు కల్యాణకట్ట, నూతనంగా ఏర్పాటు చేసిన స్వామివారి నిత్యకల్యాణం, చండీహోమం, సత్యనారాయణవ్రతం నిర్వహించే ప్రదేశాలను పరిశీలించారు. ఆయా విభాగాల ఇన్‌చార్జీలు, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. భక్తులతో మర్యాదపూర్వకంగా మెదలాలని ఆలయ సిబ్బందికి సూచించారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాజన్న క్షేత్రం భక్తులు లేక బోసిపోయింది.
ఇల్లంతకుంట(మానకొండూర్): ఉపాధిహామీ లో చేపట్టిన పనుల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని డీఆర్డీవో శేషాద్రి హెచ్చరించారు. మండల పరిషత్‌లో మంగళవారం నిర్వహించిన 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికలో మాట్లాడారు. 2024–25లో ఇల్లంతకుంటలోని 33 గ్రామపంచాయతీల్లో ఈజీఎస్ కింద రూ.5.69 కోట్ల పనులు, పంచాయతీరాజ్ కింద రూ.2.78కోట్ల పనులు చేపట్టినట్టు తెలిపారు. ఎంపీడీవో శశికళ, ఏవీ వో రామారావు, ఏఎన్వీ అరుణ్‌కుమార్, ఏఈ ఈ రాజేశ్, ఏపీవో చంద్రయ్య పాల్గొన్నారు.
వేములవాడరూరల్: అంగన్‌వాడీ సెంటర్‌కు వచ్చే చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని డీడబ్ల్యూవో లక్ష్మీరాజం సూచించారు. వేములవాడ రూరల్ మండలంలోని హన్మాజిపేట, జయవరం, మల్లారం, లింగంపల్లి, బొల్లారం గ్రామాల్లోని అంగన్‌వాడీ సెంటర్లను మంగళవారం తనిఖీ చేశారు.
సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా మంగళవారం ముసురు వర్షాలు కురిశాయి. ఎల్లారెడ్డిపేటలో అత్యధికంగా 26.9 మిల్లీమీటర్లు, ఇల్లంతకుంటలో 18.9, రుద్రంగిలో 10.3, చందుర్తిలో 11.8, వేములవాడ రూరల్‌లో 12.9, బోయినపల్లిలో 12.3, వేములవాడలో 15.9, సిరిసిల్లలో 12.1, కోనరావుపేటలో 5.2, వీర్నపల్లిలో 7.6, గంభీరావుపేటలో 6.1, ముస్తాబాద్‌లో 12.3, తంగళ్లపల్లిలో 10.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
గిరిజన యువతకు శిక్షణ
సిరిసిల్ల కల్చరల్: సెంటర్ ఫర్ నానో సైన్స్, ఇంజినీరింగ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు ఆధ్వర్యంలో గిరిజన పరిశోధన సమాచారం, విద్య, కమ్యూనికేషన్, ఈవెంట్స్‌పై ‘సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ – క్యారెక్టరైజేషన్ శిక్షణ్ఙ అనే ప్రాజెక్ట్ నందు గిరిజన యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి సంగీత తెలిపారు. https:// www.cense.IIsc.ac.in. వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ఆలయ విస్తరణ పనులు ప్రారంభం

ఆలయ విస్తరణ పనులు ప్రారంభం

ఆలయ విస్తరణ పనులు ప్రారంభం