
అన్నపూర్ణలో 2 టీఎంసీలు
ఇల్లంతకుంట: అన్నపూర్ణ జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం రెండు టీఎంసీలకు చేరింది. 12,800 క్యూసెక్కులు వస్తుండగా, 6,600 క్యూసెక్కులు రంగనాయక సాగర్‌లోకి వెళ్తున్నాయి.
ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది.
జై కేసీఆర్
వేములవాడఅర్బన్: మాజీ సీఎం కేసీఆర్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని వేములవాడ మాజీ జెడ్పీటీసీ మ్యాకల రవి పేర్కొన్నారు. వేములవాడ మండలం నందికమాన్ నుంచి మంగళవారం బీఆర్‌ఎస్ నాయకులు బైకు ర్యాలీ తీశారు. మండలంలోని ఆరెపల్లి శివారులోని మిడ్‌మానేరు ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్‌లో కేసీఆర్ చిత్రపటానికి కాళేశ్వరం నీటితో అభిషేకం చేశారు. సెస్ డైరెక్టర్ రేగులపాటి హరిచరణ్‌రావు, ఆర్‌సీ రావు, తదితరులు పాల్గొన్నారు.