
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
ముస్తాబాద్(సిరిసిల్ల): నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా హెచ్చరించారు. మండలంలోలోని శ్రీనివాస్ ఎరువులు– విత్తనాలు, కోరమండల్ మన గ్రోమోర్ విక్రయ దుకాణాలను, గోదాములను, ఆవునూరులోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. కోరమండల్ మన గ్రోమోర్ గోదాంలో యూరియా స్టాక్ లేనట్లు గుర్తించి నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం, ఏవో దుర్గరాజు పాల్గొన్నారు.