
దుర్వాసన వస్తోంది
చంద్రంపేటలో డ్రెయినేజీలు లేకపోవడంతో ఇండ్లలో వాడుకున్న నీరు రోడ్లపైన పారుతుంది. ఓ వైపు దోమల బెడద, మరోవైపు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాము. రోడ్లు సరిగా లేవు. చిన్న వర్షం పడితే బురదగా మారి, వాహనాలు దిగబడుతున్నాయి.
– మచ్చ లక్ష్మి, చంద్రంపేట
వీధిదీపాలు లేవు
చిన్నపాటి వర్షానికే కాలనీ రోడ్డు బురదగా మారుతుంది. బయటకు వెళ్లాలంటే బురదలో నుంచే వెళ్లి రావాలి. వీధి దీపాలు సైతం లేవు. ఇండ్ల చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి దోమలు వృద్ధి చెందుతున్నాయి. మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.
– దిండిగాల శ్రీనివాస్, జ్యోతినగర్
చర్యలు తీసుకుంటాం
సిరిసిల్ల మున్సిపాలిటీలోని విలీన గ్రామాల్లో పారిశుధ్యం నిర్వహణ, ఫాగింగ్, బ్లీచింగ్‌పౌండర్ పిచికారీ చేయిస్తున్నాం. పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇండ్ల మధ్య ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు, మురుగునీరు నిలువకుండా ఆయా ప్లాట్ల యజమానులకు నోటీసులు ఇచ్చాం. పారిశుధ్య నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటాం.
– కిరణ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్

దుర్వాసన వస్తోంది