
తల్లిదండ్రుల కష్టాలను చూసి..
మాది బోయినపల్లి మండలం కొదురుపాక. అమ్మ విజ య, నాన్న మురళి వ్యవసా యం చేస్తారు. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. ఇద్ద రు అక్కలకు పెళ్లిళ్లు అయ్యా యి. చిన్నదాన్నైన నన్ను కష్టపడి చదివించారు. నేను నిద్రపోయేంత వరకు అమ్మనాన్న కూడా మేల్కొనే ఉండేవారు. వారి కష్టాన్ని చూసి నేను స్ఫూర్తి పొందాను. కొదురుపాకలో 6 వరకు, 7 నుంచి ఇంటర్ వరకు కరీంనగర్‌లో, ఐదేళ్ల లా కోర్సు కాకతీయ యూనివర్సిటీలో చదివాను. కరోనా సమయంలో అందివచ్చిన అవకాశాన్ని జార విడచుకోవద్దనే పట్టుదలతో చదివాను. 150 నుంచి 200 వరకు జడ్జిమెంట్లు చదివాను. విజయం సాధించి, ప్రస్తుతం హన్మకొండలో పనిచేస్తున్నాను. – తడిగొప్పుల ప్రవళిక