‘డబుల్‌’ కల నెరవేరేదెప్పుడో? | - | Sakshi
Sakshi News home page

‘డబుల్‌’ కల నెరవేరేదెప్పుడో?

Jul 14 2025 4:29 AM | Updated on Jul 14 2025 4:29 AM

‘డబుల

‘డబుల్‌’ కల నెరవేరేదెప్పుడో?

● వసతులు లేవంటూ పంపిణీలో జాప్యం ● ఏళ్లుగా ఎదురుచూపులే.. ● అద్దె ఇళ్లలోనే లబ్ధిదారులు

ఇల్లంతకుంట(మానకొండూర్‌): నిరుపేదల సొంతింట కల నెరవేరడం లేదు. లబ్ధిదారులుగా ఎంపిక చేసినా.. అధికారులు ఇళ్ల పంపిణీలో తాత్సారంతో ఎదురుచూపులు తప్పడం లేదు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం పూర్తయినా మౌలిక వసతులు లేవని అధికారులు పంపిణీ చేయడం లేదు. దీంతో నిరుపేదలకు అద్దె ఇళ్లే దిక్కయ్యాయి.

40 ఇళ్లు.. 32 మంది లబ్ధిదారులు

ఇల్లంతకుంట మండల కేంద్రంలో ప్రభుత్వ భూ మిలో 40 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించారు. మూడేళ్ల క్రితం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 32 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అప్పటి నుంచి లబ్ధిదారులు డబుల్‌ బెడ్‌రూములు ఎప్పుడు పంపిణీ చేస్తారా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డబుల్‌ బెడ్‌రూమ్‌ల పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా పరిశీలించారు. డ బుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు వచ్చేందుకు దారి లేకపోవడంతో సమీప స్థలం యజమానితో మాట్లాడి రోడ్డు సమస్యను పరిష్కరించారు. అంతేకాకుండా రూ.20 లక్షలతో సీసీ రోడ్డు సైతం నిర్మించారు. కానీ ఇళ్లలో కరెంట్‌ వైరింగ్‌ పూర్తి కాలేదు. అంతేకాకుండా వి ద్యుత్‌ కనెక్షన్‌ కూడా ఇవ్వలేదు. నీటి సదుపాయం లేదు. డ్రెయినేజీలను నిర్మించలేదు.

163 సెక్షన్‌ అమలు

డబుల్‌ బెడ్‌రూమ్‌లను పంపిణీ చేయడం లేదని మార్చి నెలలో పలువురు లబ్ధిదారులు గదుల తాళా లు పగులగొట్టి ఆక్రమించుకున్నారు. తహసీల్దార్‌ ఫరూక్‌, పోలీస్‌ అధికారులు వెళ్లి గదులలో ఉన్న వా రిని ఖాళీ చేయించి తాళాలు వేశారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో 163 సెక్షన్‌ అమలులో పెట్టారు. దీంతో అప్పటి నుంచి అటు వైపు ఎవరూ వెళ్లడం లేదు.

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇప్పించండి

నాలుగేళ్ల క్రితం డబుల్‌ బెడ్‌రూమ్‌ వచ్చిందని గది నంబర్‌తో కూడిన స్లిప్పు ఇచ్చారు. అప్పటి నుంచి డబుల్‌ బెడ్‌రూమ్‌ కోసం ఎదురుచూస్తున్నాం. వసతులు లేవని ఆలస్యం చేస్తుండ్రు. త్వరగా ఇండ్లు పంపిణీ చేయాలి.

– గజభీంకార్‌ కిషన్‌

కిరాయి ఇంట్లో ఉంటున్న

పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే నా భర్త చనిపోయాడు. కుటుంబ గడపడం కష్టంగా ఉంది. మాకు సొంతిల్లు లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాం. కూలి పని చేసుకుంటూ బతుకున్నం. ప్రతీ నెల కిరాయి చెల్లించడం ఇబ్బందిగా ఉంటుంది.

– ఎర్రోజు స్వరూప

నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నాం

నాలుగేళ్లుగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు కోసం ఎదురుచూస్తున్నాం. అధికారులు మాత్రం పంపిణీ చేయడం లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాం. కూలి పని చేసుకుంటూ బతికే మాకు త్వరగా ఇండ్లు కేటాయించాలి.

– బండారి భాగ్య

డబుల్‌ బెడ్‌రూమ్‌లలో వసతులు కల్పిస్తున్నాం

గదులలో విద్యుత్‌, నీటి వసతి, డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. వసతులు పూర్తయిన వెంటనే పంపిణీ కార్యక్రమాన్ని చేపడతాం. డబుల్‌ బెడ్‌రూమ్‌ల వద్ద 163 సెక్షన్‌ అమలులో ఉంది. పెండింగ్‌ పనులను త్వరలోనే పూర్తి చేస్తాం.

– ఎంఏ ఫరూక్‌, తహసీల్దార్‌

‘డబుల్‌’ కల నెరవేరేదెప్పుడో?1
1/4

‘డబుల్‌’ కల నెరవేరేదెప్పుడో?

‘డబుల్‌’ కల నెరవేరేదెప్పుడో?2
2/4

‘డబుల్‌’ కల నెరవేరేదెప్పుడో?

‘డబుల్‌’ కల నెరవేరేదెప్పుడో?3
3/4

‘డబుల్‌’ కల నెరవేరేదెప్పుడో?

‘డబుల్‌’ కల నెరవేరేదెప్పుడో?4
4/4

‘డబుల్‌’ కల నెరవేరేదెప్పుడో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement