
ఆనందంగా ఉంది
మాలాంటి భూమి లేని పేదలకు ప్రభుత్వం ఇచ్చే ఆత్మీయ భరోసా కుటుంబ అవసరాల కు ఉపయోగపడుతుంది. రైతుల మాదిరి గానే మాకు కూడ ప్రభుత్వం ఆర్థిక సహాయ ం చేయడం ఆనందంగా ఉంది.
– బొడావత్ ఛక్రీ, మహిళ ఉపాధిహామీ కూలీ, గుండారం
అర్హులకు అమలు చేస్తున్నాం
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మీయ భరోసా పథకాన్ని అర్హులకు అమలు చేస్తున్నాం. భూమి లేని నిరుపేదలు, ఉపాధి పనికి ఏడాదిలో 20 రోజులకు తగ్గకుండా పనిచేసి ఉండాలి. ఇలాంటి వారిని ఎంపిక చేస్తున్నాం. ఎంపికై న వారికి నేరుగా వారి ఖాతాల్లోనే ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం డబ్బులు జమవుతాయి. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. – కొమురయ్య, ఏపీవో, ఎల్లారెడ్డిపేట

ఆనందంగా ఉంది