
ట్రాన్స్‌జెండర్లూ న్యాయ సహాయానికి అర్హులే
సిరిసిల్లకల్చరల్: సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న ట్రాన్స్‌జెండర్లకు కూడా సమాన అవకాశాలు కల్పించే దిశగా ప్రయత్నాలు జరగడం ప్రశంసనీయం అని సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రాధికా జైస్వాల్ అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలు, జిల్లా శాఖ చైర్మన్, ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ మార్గదర్శకాల మేరకు శుక్రవారం న్యాయస్థానం ఆవరణలో ట్రాన్స్‌జెండర్లు, సెక్స్‌వర్కర్లకు గుర్తింపు కార్డులు అందజేశారు. సాంఘిక వివక్షకు గురవుతున్న ట్రాన్స్ జెండర్ల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం న్యాయ సేవాధికార సంస్థ సేవలు అందుకునే వీలున్నప్పటికీ గుర్తింపు కార్డులు లేకపోవడం వల్ల అవకాశాలు కోల్పోయారన్నారు. ఈవిషయాన్ని గుర్తించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వ యంత్రాంగం సాయంతో గుర్తింపు కార్డులు జారీ చేయించారని తెలిపారు. ఈ గుర్తింపు వల్ల న్యాయసాయం పొందేందుకు అర్హత లభిస్తుందన్నారు. న్యాయవాదులు ఆడెపు వేణు, కడగండ్ల తిరుపతి, కొండ సత్యనారాయణ, వేంకటేశ్వర్లు, తిరుమల, ఇన్‌ఫోసెమ్ ప్రాజెక్టు డైరెక్టర్ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
పట్టు పురుగుల పెంపకంపై సర్వే
వేములవాడరూరల్: మేరా రేషమ్ మేరా అభియాన్–2024 కింద వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి, వెంకటాంపల్లి, అచ్చన్నపల్లి, ఫాజుల్‌నగర్ గ్రామాల్లో శుక్రవారం పట్టుపురుగుల పెంపకంపై శాస్త్రవేత్తలు, అధికారులు సర్వే నిర్వహించినట్లు జిల్లా సెరికల్చర్ అధికారి జగన్‌రావు తెలిపారు. సెరికల్చర్‌పై రైతులకు అవగాహన కల్పించారని అన్నారు.