
దందా!
అబార్షన్ కిట్ల
● ప్రిస్క్రిప్షన్ లేకుండా యథేచ్ఛగా విక్రయాలు
● ఆడపిల్లలను కడుపులోనే చంపే మాత్రల అమ్మకాలు
● మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ దాడులు
● జగిత్యాలలో 5, పెద్దపల్లిలో 6 షాపులకు షోకాజ్ నోటీసులు
● సిరిసిల్లలో ఒక షాపు మూసివేత
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
ఆడపిల్లలను అమ్మ కడుపులోనే చిదిమేసే అబార్షన్ కిట్లపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) కొరడా ఝుళిపిస్తోంది. ఎలాంటి వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా యథేచ్ఛగా అబార్షన్ మాత్రలు విక్రయిస్తున్న పలు మెడికల్‌షాపులపై డీసీఏ అధికారులు వరుస దాడులతో హడలెత్తిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి.. అన్ని మెడికల్ షాపులలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోనూ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సిరిసిల్లలో ఒక షాపు అధికారులు మూసివేశారు. జగిత్యాలలో ఐదు, పెద్దపల్లిలో 6 షాపులకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. వైద్యుల సలహాలు లేకుండా మాత్రలు విక్రయిస్తే.. వాడిన వారికి అంతర్గత స్రావంతో పాటు ప్రాణాలు పోయే ప్రమాదముందని స్పష్టంచేస్తున్నారు. రోగుల ప్రాణాల మీద వస్తుందని తెలిసీ.. ఇష్టానుసారంగా జరుగుతున్న ఇలాంటి విక్రయాలపై డీసీఏ కొరడా ఝళిపించడాన్ని పలువురు స్వాగతిస్తున్నారు.