అన్నదానం చేయడం అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

అన్నదానం చేయడం అభినందనీయం

Jul 19 2025 4:00 AM | Updated on Jul 19 2025 4:00 AM

అన్నద

అన్నదానం చేయడం అభినందనీయం

వేములవాడ: కక్షిదారులకు అన్నదానం చేయ డం అభినందనీయమని సీనియర్‌ సివిల్‌ జడ్జి అజయ్‌కుమార్‌ జాదవ్‌, ఇన్‌చార్జి జూనియర్‌ సివిల్‌ జడ్జి ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. ఆషాఢమాసం సందర్భంగా శుక్రవారం వేములవాడ కోర్టు ప్రాంగణంలో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ న్యాయవాది గణేశ్‌, బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యక్షులు కట్కం జనార్దన్‌, ఏజీపీ బొడ్డు ప్రశాంత్‌, సిరిసిల్ల బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి వెంకటి, మాజీ అధ్యక్షులు నేరెళ్ల తిరుమల్‌ గౌడ్‌, పొత్తూరి అనిల్‌ కుమార్‌, గుడిసె సదానందం, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు.

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుంటే చర్యలు

తంగళ్లపల్లి(సిరిసిల్ల): ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎంవీఐ) వంశీధర్‌ అన్నారు. శుక్రవారం తంగళ్లపల్లి మండల కేంద్రంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన పత్రాలు, ఫిట్‌నెస్‌, ఇన్సూరెన్స్‌ పరిశీ లించారు. వాహనాలు నడిపేటప్పుడు అన్ని ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలని అన్నారు. ఆర్టీఏ సిబ్బంది పాల్గొన్నారు.

గురుకులాల్లో సమస్యలు తీర్చాలి

సిరిసిల్లటౌన్‌: గురుకులాల్లో సమస్యలు తీర్చాలని కోరుతూ శుక్రవారం సిరిసిల్ల పాతబస్టాండ్‌లో బీఆర్‌ఎస్‌ యూత్‌, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ యూత్‌, విద్యార్థి విభాగాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలు పాయిజన్‌కు నిలయాలుగా మారాయని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో 90 మంది విద్యార్థులు చనిపోయారని అన్నారు. ఏడాదిలోనే వెయ్యి మందికి పైగా విషాహారం తిని ఆస్పత్రి పాలయ్యారని తెలిపారు. జిల్లా నాయకులు మట్టె శ్రీనివాస్‌, నాయకులు వడ్లూరి సాయి, సూర్య, అనిల్‌ గౌడ్‌, రాజు నరేష్‌, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

బైలాకి వ్యతిరేకంగా

పద్మశాలీ ఎన్నికలు

సిరిసిల్ల అర్బన్‌: సిరిసిల్ల పద్మశాలీ సంఘం ఎన్నికల్లో సభ్యుల మనోభావాలకు, సంఘం బైలాకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నారని అడ్‌హక్‌ కమిటీ కన్వీనర్‌ కుసుమ విష్ణుప్రసాద్‌ అ న్నారు. శుక్రవారం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పద్మశాలీ సంఘం పెద్దల కోసం సామాన్య సభ్యులు ఎన్నికల్లో నిలబడకుండా చేయాలనే ఉద్దేశంతో నామినేషన్ల ఫీజు పెంచినట్లు తెలిపారు. దీనికి వ్యతిరేకంగా పద్మశాలీలంతా ఐకమత్యంగా మరో సంఘం నిర్మితం కావాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా నూతన అడ్‌హక్‌ కమిటీని వేసినట్లు తెలిపారు.

ప్రజాబలం కాంగ్రెస్‌కే

సిరిసిల్లటౌన్‌: శాసనసభ, పార్లమెంట్‌ ఎన్ని కల మాదిరిగానే జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాబలం మళ్లీ కాంగ్రెస్‌కే ఉందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేటీఆర్‌ సిరిసిల్లలో మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్‌ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ కోసం ఎదురుచూస్తుందని, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

అన్నదానం చేయడం   అభినందనీయం
1
1/3

అన్నదానం చేయడం అభినందనీయం

అన్నదానం చేయడం   అభినందనీయం
2
2/3

అన్నదానం చేయడం అభినందనీయం

అన్నదానం చేయడం   అభినందనీయం
3
3/3

అన్నదానం చేయడం అభినందనీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement